యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ దూకుడు: రెండు రోజులకే మరొకటి ప్రకటించేశాడు

పేరుకు తమిళ వ్యక్తే అయినా.. తెలుగులో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న ఆయన.. చాలా తక్కువ సమయంలోనే విపరీతమైన ఫాలోయింగ్‌ను దక్కించుకున్నారు. తెలుగు హీరోల నుంచి పోటీ నెలకొని ఉన్నప్పటికీ.. టాలీవుడ్‌లో తన హవాను చూపించారు. అయితే, కొన్నేళ్ల పాటు వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న రాజశేఖర్.. 'పీఎస్వీ గరుడవేగ'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలను ప్రకటిస్తూ దూసుకెళ్లిపోతున్నారాయన.

ఫిబ్రవరి 4న రాజశేఖర్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని తన 91వ సినిమాను ప్రకటించారు. దీనితో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా వదిలారు. లలిత్ అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు 'శేఖర్' అనే టైటిల్ పెట్టారు. ఎల్‌ఎమ్‌వీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. శివానీ, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం‌లు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇది ప్రకటించిన రెండు రోజులకే మరో సినిమాను అనౌన్స్ చేసి షాకిచ్చారాయన.

Rajasekhar 92nd Movie First Look Released

రాజశేఖర్ 92వ సినిమాకు సంబంధించిన ప్రకటన శనివారం ఉదయం వెలువడింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు చిత్ర వివరాలను పంచుకుంది. కిరణ్ అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని ఆఫ్ బీట్ ఫిల్మ్స్, ఎస్ ఒరిజినల్స్, పెగాసెస్ సినీ సంస్థలపై శివానీ శివాత్మిక, సృజన్, భార్గవ, హర్ష ప్రతాప్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం థీమ్ పోస్టర్‌లో న్యూస్ పేపర్, ఓ తుపాకీ, మందు గ్లాస్‌.. దాని మీద సిగర్ కనిపిస్తున్నాయి. దీంతో ఇది కూడా థ్రిల్లర్ జోనర్‌లోనే రాబోతుందన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X