వీడియో: అంచనాలు పెంచేసిన రాజశేఖర్.. టైటిల్‌తోనే దుమ్ములేపాడు!
సీనియర్ హీరో రాజశేఖర్ చాలా కాలం తరువాత నటించిన గరుడ వేగా చిత్రం గత ఏడాది విడుదలై మంచి విజయం సాధించింది. డా.రాజశేఖర్ గత ఏడాది నటించిన పి.ఎస్.వి.గరుడవేగ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పవర్‌ఫుల్ రోల్స్‌తో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న కథానాయకుడు డా.రాజశేఖర్ హీరోగా.. అ! వంటి విలక్షణమైన చిత్రాన్ని తెరకెక్కించిన విన్నూత్న దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో రూపొందున్న చిత్రానికి కల్కి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యపీ మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రానికి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మాతలు.

ఈ చిత్రం థ్రిల్లర్ కథాంశంతో 1983 పరిస్థితుల నేపథ్యంలో సాగుతుందని ఇటీవల ఓ ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చారు. నేడు రక్షాబంధన్ సందర్భంగా టైటిల్ ప్రకటిస్తూ ఆసక్తికరమైన వీడియో విడుదల చేసారు. ఈ చిత్రానికి కల్కి అనే టైటిల్ ఖరారు చేశారు. శ్రీ మహావిష్ణు దశావతారాలలో కల్కి కూడా ఒకటి.
దశావతారాలని గుర్తులుగా ఉండే శ్రీ మహా విష్ణు ఆయుధాలు, వస్తువులు ఒక్కొక్కటి చూపిస్తూ చివర్లో కల్కి అనే టైటిల్ రివీల్ అవుతుంది బ్యాగ్ గ్రౌండ్ సంగీత చాలా బావుంది. కదిలినాడు కల్కి అనే లైన్ కూడా వినిపిస్తోంది. టైటిల్ తో ఇప్పటినుంచే అంచనాలు పెంచేశారని చెప్పొచ్చు.
శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యపీ మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రానికి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మాతలు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుండి ప్రారంభం అవుతుంది. మిగతా నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.


Click it and Unblock the Notifications











