Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇక యుద్ధం చేయాల్సింది రాముడే.. కల్కి సెన్సార్ పూర్తి..
యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కథానాయకుడిగా 'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కల్కి'. శివాని, శివాత్మిక, 'వైట్ లాంబ్ టాకీస్' వినోద్ కుమార్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 28న విడుదల అవుతుండగా... అమెరికాలో ఒక్క రోజు ముందు 27న ప్రీమియర్ షోలు వేస్తున్నారు.కల్కి సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్నది. సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ లభించింది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్, టీజర్, కమర్షియల్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. కొన్ని గంటల క్రితం విడుదలైన హానెస్ట్ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కథ ఎలా ఉండబోతుందనేది ఈ ట్రైలర్లో చూపించారు.
ముఖ్యంగా ట్రైలర్లో 'హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు. యుద్ధం చేయాల్సింది రాముడే' డైలాగ్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్, ప్రొడక్షన్ వేల్యూస్, శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. వీటన్నిటి కంటే ముఖ్యంగా రాజశేఖర్ గారి స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
'కల్కి' పాత్రలో రాజశేఖర్ యాటిట్యూడ్, యాక్టింగ్ హైలైట్ అయ్యాయి. 'గరుడవేగ' తర్వాత 'కల్కి'తో ఆయన మరో హిట్ అందుకోబోతున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
నటీనటులు: అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, 'వెన్నెల' రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.
సాంకేతిక
వర్గం:
ఛాయాగ్రహణం:
దాశరథి
శివేంద్ర,
సంగీతం:
శ్రవణ్
భరద్వాజ్,
స్క్రీన్
ప్లే:
స్క్రిప్ట్స్
విల్,
ఆర్ట్:
నాగేంద్ర,
ఎడిటర్:
గౌతమ్
నెరుసు,
స్టిల్స్:
మూర్తి,
లిరిక్స్:
కృష్ణకాంత్
(కె.కె),
కాస్ట్యూమ్
డిజైనర్:
అదితి
అగర్వాల్,
ఫైట్స్:
నాగ
వెంకట్,
రాబిన్
-
సుబ్బు,
ప్రొడక్షన్
కంట్రోలర్:
సలన
బాలగోపాల్
రావు,
చీఫ్
కో-డైరెక్టర్:
మాధవ
సాయి,
లైన్
ప్రొడ్యూసర్:
వెంకట్
కుమార్
జెట్టి,
పి.ఆర్.ఓ:
నాయుడు
సురేంద్ర
కుమార్
-
ఫణి
కందుకూరి,
సమర్పణ:
శివాని,
శివాత్మిక,
నిర్మాత:
సి.కళ్యాణ్,
దర్శకత్వం:
ప్రశాంత్
వర్మ.