ఎన్నికలవేళ రాజశేఖర్ పొలిటికల్ డ్రామా ‘అర్జున’
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఎప్పుడో ఏడేళ్ల క్రితం ఆగిపోయిన హీరో రాజశేఖర్ నటించిన పొలిటికల్ డ్రామా మూవీ విడుదలకు సిద్ధమౌతోంది. 'అర్జున' టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి కణ్మని దర్శకత్వం వహించారు. రాజశేఖర్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు.
2012లో విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో ఆగిపోయింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని సికె ఎంటర్టెన్మెంట్స్, హ్యాపీ మూవీస్ సంస్థలు మార్చి 15న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది.

రిలీజ్ డేట్ ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్లలో రాజశేఖర్ లుక్ డిఫరెంటుగా ఉంది. ఏడెనిమిదేళ్ల క్రితం తీసిన సినిమా కావడంతో రాజశేఖర్ మరింత యంగ్ లుక్‌తో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
ప్రస్తుతం రాజశేఖర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'కల్కి' అనే చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 'పిఎస్‌వి గరుడవేగ' తర్వాత రాజశేఖర్ మళ్లీ హీరోగా నిలదొక్కుకుని విభిన్నమైన చిత్రాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.


Click it and Unblock the Notifications











