twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శివానీ రాజశేఖర్‌కి ఆదిలోనే ఎదురుదెబ్బ.. అరె! ఇలా జరిగిందేంటి..?

    |

    సినీ పరిశ్రమలో కెరీర్ స్టార్ట్ కావడం, ఆ కెరీర్ సక్సెస్‌ఫుల్ బాటలో సాగడం అనేది కొందరికే సాధ్యపడుతుంది. నటీనటుల ప్రతిభ, పట్టుదలకు తోడు అదృష్టం కూడా ఉండనిదే కెరీర్ స్టాండ్ కాదు. కొన్ని సందర్భాల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాలు కూడా ఊహించని రీతిలో విడుదలకు నోచుకోవు. అలాంటి సిచ్యువేషన్ లోనే ఉంది హీరో రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ రాజశేఖర్‌. ఇంతకీ అసలు విషయమేంటి? వివరాల్లోకి పోతే..

    సినీ వారసులు.. వెండితెర ప్రవేశాలు

    సినీ వారసులు.. వెండితెర ప్రవేశాలు

    బాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ వరకూ అన్ని భాషా చిత్రాల్లోనూ సినీ వారసులు వెండితెరపై అడుగు పెడుతూ రాణిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది నటీనటులు ఇలా సినీ ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే జీవిత రాజశేఖర్ కూతుళ్ళిద్దరూ టాలీవుడ్ తెరపై కాలుపెట్టేందుకు సిద్ధమయ్యారు.

    చిన్న కూతురు ఓకే కానీ పెద్ద కూతురుకే సమస్య

    చిన్న కూతురు ఓకే కానీ పెద్ద కూతురుకే సమస్య

    మనం చెప్పుకున్నట్లుగానే సినీ ఇండస్ట్రీలో అదృష్టం కూడా కలిసి రానిదే ఏదీ జరగదు. ఈ కోణంలోనే జీవిత రాజశేఖర్ చిన్నకూతురు శివాత్మిక సినీ రంగ ప్రవేశం సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. 'దొరసాని' వెండితెరపై కాలు పెట్టింది శివాత్మిక. కానీ జీవిత రాజశేఖర్ పెద్ద కూతురు సినిమాకే సమస్య వచ్చిపడింది. ఆమె నటించిన సినిమా విడుదలకు నోచుకోవడం లేదని తెలిసింది.

    2 స్టేట్స్ రీమేక్‌లో శివాని

    2 స్టేట్స్ రీమేక్‌లో శివాని

    హిందీలో సూప‌ర్ హిట్ సాధించిన '2 స్టేట్స్' సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేయాలనుకున్నారు. రాజ‌శేఖ‌ర్ కూతురు శివానీ రాజ‌శేఖ‌ర్ ఈ సినిమాతోనే హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కావాల్సి ఉంది. వెంక‌ట్ కుంచం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలిసింది. ఎమ్ఎల్వి స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌లో నిర్మించనున్నారు.

    సడెన్ షాక్.. ఆగిపోయిందా..?

    సడెన్ షాక్.. ఆగిపోయిందా..?

    ఈ చిత్రానికి సంబంధించి కోల్‌క‌త్తా, హైద‌రాబాద్ లొకేషన్స్‌లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగింది. చివ‌రి షెడ్యూల్ షూటింగ్ ఒక్క‌టే బాకీ ఉందని తెలిసింది. కానీ ఇంతలో ఈ చిత్రాన్ని ఆపేశారని హీరో అడవి శేష్ కన్ఫర్మ్ చేశాడు. తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన '2 స్టేట్స్' రీమేక్ ఆగిపోయిందని స్పష్టం చేశాడు. దీంతో రాజశేఖర్ అభిమానులు షాక్ అయ్యారు.

    English summary
    Bollywood successfull movie '2 states' will remake in telugu. This movie shooting is already started. As per latest talk this movie is stopped.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X