twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనాను ఎదురించిన రాజశేఖర్.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి.. జీవిత ధన్యవాదాలు

    |

    ప్రముఖ సినీ హీరో డాక్టర్ రాజశేఖర్‌ అభిమానులకు శుభవార్త. గత కొద్ది రోజుల క్రితం కరోనావైరస్ పాజిటివ్ బారిన పడిన ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. తాను అనారోగ్యం నుంచి బయటపడటానికి కృషి చేసిన వైద్య సిబ్బందికి పేరు పేరున ధన్యావాదాలు తెలిపారు. వైద్య సిబ్బందితో కలిసి ఫోటో దిగారు.

    ఇదిలా ఉండగా, రాజశేఖర్ అరోగ్యంపై ఆయన కుమార్తె శివాత్మిక తన తండ్రి ఆరోగ్యంపై ట్వీట్ చేశారు. నాన్న గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడానికి మీ ప్రార్థనలు, దీవెనలు కావాలి. ఆయన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దు. నాన్న త్వరగా కోలుకొంటారనే నమ్మకం బలంగా ఉంది. ఇలాంటి సమయంలో మాకు మనోధైర్యం కలిగించడానికి మీ అండ కావాలి అని శివాత్మిక తెలిపారు. దాంతో ఆయనకు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయం బయటకు వచ్చింది.

    Rajashekhar tested Coronavirus negative, discharged from Citi Nuero Centre

    గతనెల రోజులుగా బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్‌లో రాజశేఖర్ చికిత్స పొందుతున్నారు. ఆయన భార్య జీవిత ఆయన ఆరోగ్యం గురించిన వస్తున్న రూమర్లను ఖండిస్తూ.. ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా ఆయన కరోనా నుంచి బయటపడటంతో వైద్యులు ఆయన్ని డిశ్చార్జ్ చేశారు.

    Rajashekhar tested Coronavirus negative, discharged from Citi Nuero Centre

    కరొనా క్లిష్ట పరిస్థితుల్లో తన భర్తను ప్రాణాపాయం నుంచి కాపాడిన సీఎన్‌సీ వైద్య బృందానికి జీవిత రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. నెలరోజుల పాటు ఆస్పత్రి సిబ్బంది తమను కుటుంబసభ్యుల్లా చూసుకున్నారని తెలిపిన జీవిత రాజశేఖర్ ... అభిమానులు, కుటుంబ సన్నిహితుల ప్రార్థనలు ఫలించి రాజశేఖర్ కోలుకున్నారని జీవిత సంతోషం వ్యక్తం చేశారు.

    English summary
    Rajashekhar tested Coronavirus negative, discharged from Citi Nuero Centre. Earlier, Shivathmika Rajashekar about hero Rajashekhar health. She tweeted that, I cannot thank you all enough for your love and wishes! But please know, he is not critical.. he is stable and getting better!We just need your prayers and positivitySparkling heart Thank you once again. Sparkling heart Do not panic. Please do not spread fake news.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X