twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెల్లిని నేనే చచ్చిపొమ్మన్నా.. ఇదంతా కామనే, రాజీవ్ కనకాల సంచలన వ్యాఖ్యలు

    |

    నటుడు రాజీవ్ కనకాల ఇంట వరుస విషాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట తల్లి తర్వాత ఏడాది తండ్రి తరువాత గత ఏడాది కరోనా మొదలయ్యే సమయానికి చెల్లి ఇలా ముగ్గురు ఆయనకు దూరమయ్యారు. తన చెల్లి మరణం గురించి రాజీవ్ కనకాల తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

    గత ఏడాది మరణం

    గత ఏడాది మరణం

    సరిగ్గా కరోనా మొదలైన తొలినాళ్ళలో రాజీవ్ కనకాల సోదరి నటి శ్రీలక్ష్మి కన్నుమూశారు. కొన్నాళ్లుగా రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న శ్రీలక్ష్మి కేవలం నలభై సంవత్సరాల వయసులో తన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిన పరిస్థితి. శ్రీ లక్ష్మి భర్త పెద్ది రామారావు ఒక జర్నలిస్టు కాగా ఆయన ప్రస్తుతం తెలంగాణలో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం కాగా ప్రేరణ, రాగలీన అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

    నారప్ప షూట్ లో ఉండగా

    నారప్ప షూట్ లో ఉండగా

    అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చెల్లి మరణం గురించి రాజీవ్ కనకాల ఎమోషనల్ అవుతూ కొన్ని కామెంట్స్ చేశారు. తాను నారప్ప షూటింగ్ ముగించుకుని వచ్చే సమయానికి చెల్లి ఆరోగ్యం విషమించింది అనే విషయం తనకు తెలిసిందని ఆయన అన్నారు. నారప్ప సినిమా కోసం మధురైలో షూటింగ్ జరుగుతూ ఉండగా 18వ తారీఖున కరోనా కేసులు నమోదు అవుతున్నాయని చెబుతూ షూటింగ్ ప్యాకప్ చెప్పారని ఆయన అన్నారు.

     నాకే అనిపించింది

    నాకే అనిపించింది

    అలా ఇంటికి వచ్చిన వెంటనే తన బావ తనకు ఫోన్ చేశారని పరిస్థితి విషమించిందని వచ్చి చూసి వెళ్లాలని కోరారు అని అన్నారు. అయితే అప్పుడు వెళ్లి చూశాక పర్వాలేదు అనిపించిందని కానీ ఒక వారం తర్వాత మళ్లీ ఫోన్ రాగా ఈసారి వెళ్లి చూస్తే పరిస్థితి బాగోలేదు అనిపించింది అని చెప్పుకొచ్చారు.

     ప్రాణం ఉగ్గబట్టుకోకు

    ప్రాణం ఉగ్గబట్టుకోకు

    ఇదంతా చూసి తానే ఆమె దగ్గరికి వెళ్లి ఇంకా ప్రాణం ఉగ్గబట్టుకోకు దయచేసి ప్రాణం వదిలేయమని చెప్పాను అని ఆమెను చూస్తే తనకు అంతగా బాధ వేసింది అని చెప్పుకొచ్చారు. ఇక ఇద్దరు పిల్లలు కూడా మా బావగారి సంరక్షణలోనే ఉన్నారని పేర్కొన్న రాజీవ్ కనకాల వారిద్దరూ ఎప్పటికప్పుడు తనతో ఫోన్లో టచ్ లోనే ఉంటారు అని చెప్పుకొచ్చారు.

    చాలా కామన్ గానే

    చాలా కామన్ గానే

    పిల్లని సుమ ఇంటికి తీసుకు రావడం వాళ్ళ ఇంటికి వెళ్లి సమయం గడపడం ఇదంతా చాలా కామన్ గా నే జరుగుతూ ఉంటుందని అమ్మ లేని లోటు తీర్చలేనిది గాని కొంతలోకొంత ఆమెను జ్ఞాపకం తీసుకు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. ఇక రాజీవ్ కనకాల తాజాగా నటించిన నారప్ప సినిమా మంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటోంది.

    Recommended Video

    Narappa Vs Asuran : Which One is best ? | Filmibeat Telugu
    నారప్ప సక్సెస్ తో

    నారప్ప సక్సెస్ తో

    వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించారు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురాన్ సినిమాను తెలుగు రీమేక్ గా తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రాజీవ్ కనకాల వెంకటేష్ బావమరిది పాత్రలో నటించారు.

    English summary
    Srilakshmi Kanakala, sister of actor Rajeev Kanakala and sister-in-law of ace Telugu anchor Suma Kanakala, passed away recently. in a recent interview Rajeev Kanakala becomes Emotional
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X