350 కోట్ల అప్పు ? పేకాట మత్తులో రాజీవ్ కనకాల అలా చేశాడా?
Rajeev Kanakala - Harsha Vardhan: టాలీవుడ్‌లో మల్టీ టాలెంటెడ్ నటుల్లో రాజీవ్ కనకాల (Rajeev Kanakala)ఒకరు. సీనియర్ నటుడు దేవదాస్ కనకాల కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాజీవ్, తన సహజ నటనతో సీరియల్స్ నుంచి సినిమాల దాకా పలు పాత్రల్లో నటించి మెప్పించారు. తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇక 'అమృతం' సీరియల్‌తో గుర్తింపు పొందిన హర్ష వర్ధన్, ప్రస్తుతం రచయితగా, నటుడిగా, దర్శకుడిగా బిజీగా ఉన్నాడు. వీరిద్దరూ మంచి స్నేహితులు. వీరి స్నేహం ఎంత బలమైందో.. ఇటీవల హర్ష వర్ధన్ చెప్పిన ఒక సంఘటనతో మరోసారి బయటపడింది. ప్రస్తుతం హర్ష వర్ధన్ (Harsha Vardhan) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇటీవల నటుడు హర్ష వర్థన్ ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సమయంలో హర్ష వర్ధన్‌ని యాంకర్ .. "మీరు, రాజీవ్ కనకాల ఇద్దరూ రెండు రోజుల పాటు నిద్ర, ఆహారం మానేసి పేకాట ఆడారట, అది నిజమా?" అని ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. దానికి హర్ష వర్ధన్ నవ్వుతూ సమాధానమిస్తూ.. "ఈ విషయం రాజీవ్ తప్ప ఎవరికీ తెలియదు, కానీ ఇప్పుడు బయటపడిందంటే నేనూ వాడిని ఇరికిస్తాను," అని సరదాగా మొదలుపెట్టాడు.

ఇంకా మాట్లాడుతూ, "ఆ రోజుల్లో మా ఇద్దరికీ సినిమాలు లేక కొంత ఖాళీ సమయం వచ్చింది. అప్పట్లో టైమ్‌పాస్ కోసం పేకాట ఆడడం మొదలు పెట్టాం. రాత్రి 8 గంటలకు మొదలుపెట్టి తెల్లవారుజామున కాదు, మూడో రోజు ఉదయం లేచాం. మూడు రోజులు నిద్ర లేకుండా, తినకుండా పేకాటలో లీనం అయ్యాం," అని నవ్వుతూ గుర్తుచేశాడు.
మూడవ రోజు మరో స్నేహితుడు సమీర్ వారిని చూసి షాక్ అయ్యాడట. "ఏంట్రా మీరు ఇలా ఉన్నారు? ఆకలి లేదా? నిద్ర లేదా? కనీసం బాత్రూంకైనా వెళ్లారా?" అని సమీర్ ఆశ్చర్యంతో అడిగాడట. కానీ హర్ష వర్ధన్, రాజీవ్ ఇద్దరూ గేమ్‌లో మునిగిపోయి ఒక్క మాట కూడా మాట్లాడలేదట. "మేము కేవలం సైగలతోనే మాట్లాడుకున్నాం. సమీర్ విసిగి వెళ్ళిపోయాడు," " అని నవ్వుతూ గుర్తుచేశాడు.
అంతటితో ఆగకుండా హర్షవర్ధన్ మరింత ఫన్నీ ట్విస్ట్ ఇచ్చాడు. "మేము పేకాట మొదలు పెట్టినప్పుడు కేవలం 5 పైసలతో ఆడాం. కానీ ఆట అంతగా సాగింది, నేను లాస్ అవుతూ రాజీవ్ దగ్గర 350 కోట్ల అప్పులో పడ్డాను," అని హర్షవర్ధన్ నవ్వుతూ చెప్పాడు. ఈ వ్యాఖ్య విని యాంకర్ షాక్ అయ్యాడు. సోషల్ మీడియాలో కూడా ఈ మాటలు వైరల్‌గా మారాయి.
నెటిజన్లు "రాజీవ్ కనకాల దగ్గర అంత డబ్బు ఉందా?" అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇది హర్ష వర్ధన్ హ్యూమర్ అని, సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇంతలో మరో ఆసక్తికరమైన ట్విస్ట్ కూడా చెప్పాడు హర్షవర్ధన్. "ఆ ఆట మూడో రోజు సాయంత్రం వరకు సాగింది. అప్పుడు అక్కడికి సుమా వచ్చింది. ఆమె మమ్మల్ని చూసి 'ఇంకా ఇదే ఆట ఆడుతున్నారా?' అన్నట్టు చూసింది. కానీ రాజీవ్ మాత్రం పట్టించుకోకుండా 'కార్డు వెయ్యి రా' అంటూ సైగలు చేస్తున్నాడు. నేను కూడా సైగలతోనే 'సుమా వచ్చింద్రా' అని చెప్పాను.
ఆ సమయంలో పరిస్థితి తారాస్థాయిలోకి వెళ్లిపోతుందనిపించింది. 'ఇంకా కొంచెం టైమ్ ఆడితే పెద్ద గొడవే జరిగే అవకాశం ఉంది' అనిపించింది. కాబట్టి ఆ ఆట నుంచి బయటపడాలనుకున్నాను," అని చెప్పాడు. తరువాత హర్షవర్ధన్ నవ్వుతూ "అలా బయటకు వెళ్ళేలోపు రాజీవ్ కనకాల బాల్కనీ నుండి పిలిచి, రూ 350 కోట్ల అప్పు ఎప్పుడూ తీరుస్తావ్?' అని అరవగా.. నేను నవ్వుతూ ' నా దగ్గర 350 రూపాయలు కూడా లేవు.. 350 కోట్లు నాతో కాదు. నన్ను విడిచిపెట్టు' అంటూ అక్కడి నుండి పరార్ అయ్యాను," అని ఫన్నీగా చెప్పాడు.
హర్ష వర్ధన్ ఈ కామెంట్స్ చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్షన్లు వస్తున్నాయి. "మూడు రోజులు నిద్ర లేకుండా పేకాట ఆడారా?" "350 కోట్ల అప్పా లేక జోక్ ఆ?" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు "ఇది నిజమే అయితే గిన్నిస్ బుక్‌లో వేసేయాలి" అంటూ జోకులు వేస్తున్నారు. ఇంకొందరు "ఇది హర్ష వర్ధన్ కామెడీ టైమింగ్‌కి బెస్ట్ ఉదాహరణ" అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, రాజీవ్ కనకాల, హర్ష వర్ధన్ మధ్య స్నేహం ఎంత గాఢమో ఈ సరదా సంఘటన మళ్లీ చూపించింది. మొత్తానికి ఈ కథ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











