కోతి కొమ్మచ్చి ఆడనున్న రాజేంద్ర ప్రసాద్, నరేష్.. హరీష్ శంకర్ స్పెషల్ వీడియో

శతమానం భవతి వంటి చిత్రాన్ని తెరకెక్కించి జాతీయ స్థాయిలో టాలీవుడ్ సత్తాను చాటిన సతీష్ వేగేశ్న తన కుమారుడు సమీర్ వేగేశ్నను హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్ర కోతి కొమ్మచ్చి. ఈ చిత్రంలో స్వర్గీయ శ్రీహరి కుమారుడు మేఘాంశ్ కూడా ఓ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎంఎల్వీ సత్యనారాయణ లక్ష్య ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.ఈ సినిమా విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిలుగా విచ్చేసిన నిర్మాత దిల్ రాజు మొదటి షాట్ కి క్లాప్ ఇవ్వగా, హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్చాన్ చేసారు.

Harish Shankar wishes Sateesh Vegesna

అనంతరం దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ " యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న మా చిత్రాన్ని విజయదశమి పర్వదినం రోజు ప్రారంభించడం జరిగింది. నవంబర్ 3 నుండి అమలాపురంలో షూటింగ్ మొదలు పెడతాము. ఆ తర్వాత వైజాగ్ లో కొంత పార్ట్ షూట్ చేయబోతున్నాము. ఒకే షెడ్యుల్ లో సినిమాను పూర్తి చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాము." అని తెలిపారు.

నిర్మాత ఎం ఎల్ వి సత్యానారాయణ మాట్లాడుతూ " సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. వేగేశ్న సతీష్ గారు మా బ్యానర్ లో ఈ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మేఘమ్ష్ శ్రీహరి , సమీర్ లకు ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం అందిస్తుందని నమ్ముతున్నాము." అన్నారు

 Rajendra Prasad and Naresh Into Kothi Kommachi

కోతి కొమ్మచ్చి సినిమాలో ప్రముఖ నటీనటులను భాగస్వామ్యం చేస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి సీనియర్ నటులు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌ను, సీనియర్ నటులు నరేష్‌ను ఆహ్వానిస్తూ దసర పండుగ రోజున ప్రేక్షకులకు శుభవార్తను అందించారు. లక్ష్య ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Harish Shankar wishes Sateesh Vegesna

ఈ సినిమా గురించి దసరా పండుగ నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గెలుపు, ఓటములకు ఒకేలా స్పందించే వారు కొందరే ఉంటారు. అందులో నాకు తెలిసిన అలాంటి వ్యక్తి సతీష్ వెగేశ్న. శతమానం భవతి చిత్రానికి జాతీయ అవార్డు వచ్చినందుకు, విజయాలకు పొంగిపోరు. ఓటములకు కుంగిపోరు. ఆయనకు రాయడం, డైరెక్ట్ చేయడం అంటే ఇష్టం. కొత్త ప్రాజెక్టుతో ముందుకు వస్తున్నందుకు అన్నయ్యకు శుభాకాంక్షలు.

Harish Shankar wishes Sateesh Vegesna

అలాగే మా అబ్బాయి... సతీష్ వెగేశ్న కుమారుడు హీరోగా పరిచయం అవుతున్నారనే విషయం చాలా ఆనందాన్ని కలిగించింది. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అప్పుడే వాడు ఇంత పెద్ద వాడయ్యాడా అనిపిస్తుంది. సమీర్ బాగా రాణిస్తాడనే నమ్మకం ఉంది. శ్రీహరి కుమారుడు మేఘాంశ్ ‌కు మంచి భవిష్యత్‌ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. అఖండ విజయ ప్రాప్తిరస్తు అంటూ హరీష్ శంకర్ ఓ వీడియోను రిలీజ్ శుభాకాంక్షలు అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X