37 ఏళ్ల తర్వాత Ladies Tailor కాంబినేషన్... రాజేంద్రప్రసాద్, అర్చన‌ కోసం ఇళయరాజా రంగంలోకి!

దర్శకుడు వంశీ దర్శకత్వంలో రూపొందిన లేడీస్ టైలర్ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచిందో అందరికీ తెలుసు. ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, విలక్షణ నటి అర్చన కాంబినేషన్‌కు మాత్రమే కాకుండా వారిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి బ్రహ్మండమైన ఆదరణ లభించింది. అలాంటి సూపర్ హిట్ కాంబినేషన్ మళ్లీ 37 ఏళ్ల తర్వాత సెట్ అయింది. ఆ సినిమా వివరాల్లోకి వెళితే.

రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో MAA AAI ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం షష్టిపూర్తి. రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షా సింగ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ కుమార్ చౌదరి నిర్మాత. చెన్నైలోని ఇసైజ్ఞాని ఇళయరాజా స్టూడియోస్‌లో ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఇసైజ్ఞాని సంగీత దర్శకుడు ఇళయరాజా కెమెరా స్విచాన్ చేయగా... సూపర్ గుడ్ ఫిలింస్ ఆర్‌బి చౌదరి క్లాప్ ఇచ్చారు.

Rajendra Prasad, Archana re united for Shastipoorthi movie afer 37 years of Ladies Tailer

సినిమా హీరో, నిర్మాత రూపేష్ కుమార్ చౌదరి మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్, ఇళయరాజా వంటి లెజెండ్స్‌తో సినిమా చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. లేడీస్ టైలర్ తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన గారు చేస్తున్న చిత్రమిది. లేడీస్ టైలర్ తర్వాత రాజేంద్ర ప్రసాద్, ఇళయరాజా కాంబినేషన్‌లో ఆస్తులు అంతస్థులు, చెట్టు కింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల లాంటి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ కాంబినేషన్ కూడా రిపీట్ అవుతున్నది. సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఇదొక న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. జూలైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం అని చెప్పారు.

Rajendra Prasad, Archana re united for Shastipoorthi movie afer 37 years of Ladies Tailer

నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షా సింగ్, కాంతార ఫేమ్ అచ్యుత్ కుమార్, వై. విజయ, శుభలేఖ సుధాకర్ తదితరులు
నిర్మాత: రూపేష్ కుమార్ చౌదరి
దర్శకుడు: పవన్ ప్రభ
కాస్ట్యూమ్ డిజైనర్: అయేషా మరియం
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి
కొరియోగ్రఫీ: బృందా
లిరిక్స్: చైతన్య ప్రసాద్, రెహమాన్
సినిమాటోగ్రఫి: రామిరెడ్డి
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా
బ్యానర్: మా ఆయి ప్రొడక్షన్స్ LLP

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X