మరోసారి ఆ స్టార్ పై పచ్చి బూతులు.. రాజేంద్ర ప్రసాద్ నోట అలాంటి మాటలు
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కొద్ది రోజుల కింద నోట మాట జారి నవ్వుల పాలయ్యాడు. గౌరవించవాల్సిన చోట స్టార్స్ ను అవమానించేలా మాట్లాడి తన పరువును కూడా తగ్గించుకుంటున్నారు. రాబిన్ హుడ్ ఈవెంట్ లో స్టార్ క్రికెటర్ పై దుర్భాషలాడిన ఘటన మరవక ముందే మరో స్టార్ కమెడియన్ పై అతి దారుణమైన మాటలను మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. ఇంతక రాజేంద్ర ప్రసాద్ ఎవ్వరిపై పరుష పదజాలం ఉపయోగించారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది...
ఇక రాజేంద్ర ప్రసాద్ ఎంత మంచి వ్యక్తో అందరికీ తెలిసిందే. హీరోగా తన కెరియర్ ను ప్రారంభించిన రాజేంద్ర ప్రసాద్ ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం కీలక పాత్రల్లో పోషిస్తూ ఆయా చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు. తన వయస్సుకు రీత్యా పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా రాబిన్ హుడ్ చిత్రంలో నటించి అలరించారు. రీసెంట్ గా షష్టిపూర్తి సినిమాతో ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు తన కాంట్రవర్సీయల్ వర్డ్స్ తో సంచలనంగా మారుతున్నారు. తాజాగా మరోసారి కాంట్రవర్సీయల్ కామెంట్స్ చేశారు.

రాబిన్ హుడ్ చిత్ర ఈవెంట్ లో ఇలా..
రాజేంద్ర ప్రసాద్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరైన సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పరుష పదాలతో ఇంచుమించుగా పచ్చిబూతులు తిట్టారు. ఒరేయ్ డేవిడ్ వార్నరూ.. దొంగ ముం...డా కొడుకా... అంటూ దారుణంగా మాట్లాడారు. ఇక ఈ ఘటనపై తీవ్రంగా విమర్శలు రావడంతో వెంటనే తేరుకొని క్షమాపణలు చెప్పాడు. అంతటి తో సమస్య సర్దుమణిగింది. కానీ తాజాగా మరో వివాదానికి తెర లేపారు.
మరోసారి వివాదాస్పందంగా..
రాజేంద్ర ప్రసాద్ మరోసారి తన ప్రసంగంలో అత్యుత్సాహం చూపించారు. డైరెక్టర్ ఎస్వీ కృష్ణా రెడ్డి జన్మదిన వేడుకలకు హాజరైన సందర్భంగలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు యమా వైరల్ గా మారాయి. వేదికపై టాలీవుడ్ సీనియర్ నటుడు వ్యాపార వేత్త మురళీ మోహన్ వంటి వారు ఉన్న వేదికపై రాజేంద్ర ప్రసాద్ పచ్చిబూతులతో తన ప్రసంగాన్ని సాగించారు. ఓ ఉదాహరణ చెబుతూ అప్పట్లో ఓ నటుడిని ఓ ల.....జ కొడుకా ఎటు వెళ్లావురా అనే వాడిననంటూ అందరి ముందే అనడం షాకింగ్ గా మారింది.
అలాగే సభకు హాజరైన నటీనటులతోనూ కాస్తా నోరు జారుతూ మాట్లాడాడు. చప్పట్లు కొట్టండి అంటూ ఆర్డర్స్ వేసిన రీతిలో మాట్లాడారు. అంతే కాదు మురళీ మోహన్ వంటి నటుడిని పట్టుకొని నీకు సిగ్గుందా? అని అనడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. రాజేంద్ర ప్రసాద్ తన వెకిలి చేష్టలతో ప్రసంగాన్ని సాగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు లం... అంటూ స్టార్ కమెడియన్, ప్రముఖ నటుడు అలీని అన్నట్టుగా ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోల ద్వారా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











