గాలి సంపత్ డబ్బింగ్.. ఇరగ్గొట్టేస్తోన్న రాజేంద్ర ప్రసాద్
అనిల్ రావిపూడి కథ, మాటలు అందించి.. దర్శకత్వ పర్యవేక్షణ చేసిన చిత్రం గాలి సంపత్. అనిల్ రావిపూడి సమర్పణలో వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ గత వారమే విడుదలైంది. రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు ఇద్దరూ కూడా పోటాపోటీగా నటించినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా రాజేంద్రప్రసాద్ నటనలోని కొత్త కోణాన్ని చూడబోతోన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ చెబుతూ బిజీగా ఉన్నాడు. గాలి సంపత్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ విభిన్న కోణాలున్న పాత్రను పోషిస్తోన్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టే డబ్బింగ్ చెప్పడంలోనూ ఎంతో వైవిధ్యతను కనబరుస్తున్నట్టున్నాడు. ఇదే విషయాన్ని అనిల్ రావిపూడి చెబుతూ.. సినిమా పట్ల నటకిరీటీ రాజేంద్రప్రసాద్‌కు ఉన్న పాషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్టు చెప్పుకొచ్చాడు.

నన్ను నమ్మండి.. మార్చి 11న ఆయన మీ అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తాడు అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. గాలి సంపత్ మార్చి 11న రాబోతోన్నాడు కచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం డబ్బింగ్ థియేటర్లో రాజేంద్రప్రసాద్ తన పాత్రకు చెబుతున్న డైలాగ్‌లకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మొత్తానికి డబ్బింగ్‌ను మాత్రం ఇరగ్గొట్టేస్తోన్నట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











