నా ప్రాణం పోయేంత వరకు ఇలానే.. కన్నీళ్లు పెట్టుకున్న రాజేంద్ర ప్రసాద్

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తెలుగు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తున్నారు. 90లో హీరోగా మంచి మంచి చిత్రాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. ఫ్యామిలీ చిత్రాలతో పాటు కామెడీ చిత్రాలతో రాజేంద్ర ప్రసాద్ ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సీనియర్ నటుడిగా ముఖ్య పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. తనకు వీలైనంత వరకు ఆడియెన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ ను అందించే ప్రయత్నం చేస్తున్నారు.

వివాదంలో చిక్కుకున్న రాజేంద్ర ప్రసాద్..
రాజేంద్ర ప్రసాద్ ఇటీవల తన ప్రసంగాలతో తరుచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆయన ప్రవర్తన తన అభిమానులను, తెలుగు ఆడియెన్స్ కు కూడా ఇబ్బంది కలిగించేలా ఉంటోంది. దీంతో ఆయనపై ఉన్న గౌరవం క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. గతంలో టాలీవుడ్ హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ చేసిన రచ్చ గురించి తెలిసిందే. ఆ చిత్రంలో సీనియర్ నటుడి పాత్రలో నటించి, ఆ చిత్రంలో క్యామియో అప్పీయరెన్స్ ఇచ్చిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Rajendra Prasad Reacted on his Recent Speech

నోటికి వచ్చినట్టుగా..

నోటికి వచ్చినట్టుగా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను తిట్టడంతో క్రికెట్ లవర్స్ ఆయనపై మండిపడ్డారు. దీంతో దెబ్బకు క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. ఇక తాజాగా మరోసారి దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి పుట్టిన రోజు వేడుకలకు హాజరై మరోసారి నోరు జారాడు. ఈసారి ఏకంగా కమెడియన్ అలీపై పచ్చి బూతులతో రెచ్చిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దాంతో మళ్లీ రాజేంద్ర ప్రసాద్ పై గట్టిగా విమర్శలు వచ్చాయి. ఈసారి ఆయన పరుష పదజాలం వాడటంతో అలీ అభిమానులు, నెటిజన్లు రాజేంద్ర ప్రసాద్ పై విరుచుకు పడ్డారు. ఆయన తీరు మార్చుకోవాలని సూచించారు.

దీంతో తాజాగా రాజేంద్ర ప్రసాద్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తన అభిమానులకు వాగ్దానం చేశారు. తనకు వాళ్లతో ఎంతో దగ్గరి అనుబంధం ఉండటం వల్ల... ఎప్పుడూ వాళ్లతో ఎలా ఉంటానో అలానే మాట్లాడానని చెప్పారు. కానీ అది ప్రజలు నచ్చకపోవడం వల్ల ఇకపై తన తీరు మార్చుకుంటానని చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ ప్రతి ఒక్కరినీ 'మీరు' అనే సంబోంధించే వారని, ఇకపై తన ప్రాణం ఉన్నంత వరకు అందరినీ గౌరవంగానే మాట్లాడుతానని హామీనిచ్చారు. తను మాట్లాడిన మాటలకు బాధపడొద్దని చెప్పుకొచ్చారు.

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి 64వ పుట్టిన రోజు వేడుకలను రీసెంట్ గా చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీ మోహన్, బ్రహ్మానందం, అలీ, బండ్ల గణేష్, శ్రీకాంత్, ఉత్తేజ్ తదితరులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే రాజేంద్ర ప్రసాద్ కూడా హాజరై ప్రసంగించారు. అదే సమయంలో అలీపై దుర్భాషలాడాడు. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు వంటి చిత్రాలు వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X