పవన్ కల్యాణ్‌ అందుకే సీరియస్.. అది పిచ్చి..తప్పుడు నిర్ణయం.. రాజేంద్ర ప్రసాద్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడు, నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం షష్టిపూర్తి. ఈ మూవీని మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపేశ్ హీరోగా నటిస్తూ.. నిర్మించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు పవన్ ప్రభ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సీనియర్ నటి, దాసి ఫేమ్ అర్చన, యువ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రం మే 30 తేదీన తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం (మే 28) నాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చిత్ర విశేషాలను, థియేటర్ల బంద్‌పై ఏపీ సర్కార్ నిర్ణయం, అలాగే పవన్ కల్యాణ్‌తో తన అనుబంధాన్ని పంచుకొన్నారు. ఆయన మాట్లాడుతూ..

షష్టిపూర్తి చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. నేను నవ్వించే విధంగా, ప్రేక్షకుడిని ఏడ్పిపించే విధంగా కథలో వైవిధ్యం ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతీ ఒక్కరూ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వారిని ప్రేమగా పలకరిస్తారు. 48 ఏళ్ల నా కెరీర్‌లో ఎప్పుడూ మంచి పాత్రలే వస్తున్నాయి. నా వయసుకు తగ్గ పాత్రలే వస్తుండటం నా అదృష్టం. షష్టిపూర్తి గొప్ప చిత్రం అవుతుంది అని ఈ రోజు నా గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా. నేను ఎంతో సంతృప్తిగా ఫీల్ అయిన చిత్రమిది. ట్రైలర్ చూస్తే ఇది ప్రతి ఇంట్లో జరిగే కథ అని అందరికీ అర్థం అవుతుంది. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. తెలుగు వారిని ప్రతిబింబించేలా ఈ మూవీ ఉంటుంది అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

Rajendra Prasad reaction on Pawan Kalyan

35 ఏళ్ల క్రితం నేను, అర్చన కలిసి వంశీ దర్శకత్వంలో లేడీస్ టైలర్ మూవీ చేశాం. మళ్లీ ఇన్నేళ్లకు షష్టిపూర్తి మూవీని చేశాను. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? మధ్యలో ఎందుకు కలిసి చేయలేకపోయామో నాకు కూడా తెలియడం లేదు. ఆమె దాసి, నిరీక్షణ అంటూ వేరే జానర్‌లోకి వెళ్లిపోయారు. నేను నా కామెడీ జానర్‌లోకి వెళ్లిపోయాను. నేను ఎప్పుడూ కూడా నా సినిమాలో ఆ హీరోయిన్‌ను పెట్టండి.. ఈ హీరోయిన్‌ను పెట్టండి అని అడగను. ఆ అలవాటు నాకు లేదు. మళ్లీ ఇన్నేళ్లకు ఇలా షష్టిపూర్తి చేయడం ఆ దైవ నిర్ణయమే అనిపిస్తుంది. మధ్యలో ఆమెను నేను కలిసింది కూడా లేదు అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

పవన్ కల్యాణ్ ఓ ఇంటర్వ్యూలో నా గురించి చెబుతూ.. చెన్నైలో చిరంజీవి గారు నన్ను రాజేంద్ర ప్రసాద్ గారి వద్దకు పంపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు షూటింగ్ చూపించి నాకు బట్టలు కూడా కొనిపెట్టారు. చిరంజీవి మాదిరిగానే నాకు రాజేంద్ర ప్రసాద్ కూడా అన్నయ్యనే అని చెప్పారు. అయితే పవన్ కల్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. నాతో మంచి చనువు ఉంది. నాకు తమ్ముడి కంటే ఎక్కువే. కానీ ఎందుకో మా ఇద్దరికి కలిపి మంచి క్యారెక్టర్లు పడలేదు. త్వరలోనే పడుతాయని అనుకొంటున్నాను. రచయితలు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మంచి పాత్రలు, కథలు రాస్తే ఆ కోరిక తీరుతుంది అని రాజేంద్ర ప్రసాద్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Rajendra Prasad reaction on Pawan Kalyan

నా అబ్జర్వ్ చేసిన ప్రకారం.. థియేటర్లు మూసివేత అనేది ఒకరు తీసుకొనే నిర్ణయం కాదు. ఎవరో మిస్ గైడ్ చేశారు. ఒకరు తీసుకొనే నిర్ణయం, ఒక డిస్టిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, నిర్మాత తీసుకొనే విషయం కాదు. ఇండస్ట్రీలోని అందరూ సమిష్టిగా తీసుకోవాల్సిన విషయం. దానిని ఒకరు తప్పుడు విధానంలో బయటకు తీసుకొచ్చారు. ఆ నిర్ణయం నిలబడలేదు కాదా. పవన్ ఫీలయ్యాడు. ఎందుకు ఫీలయ్యాడంటే అందుకు కారణం ఎవరనేది బయటకు తీసుకు రావాలి. రన్నింగ్ థియేటర్లు బంద్ అనేది చిన్న విషయం కాదు. అలాంటి పిచ్చి డిసిషన్ తీసుకోకూడదు అని ఆయన చెప్పారు.

45 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇలాంటిది ఎప్పుడూ జరుగలేదు. వివాదంగా మారిన అంశాన్ని పవన్ కల్యాణ్ సీరియస్‌గా తీసుకొన్నాడు. ఆయన ఓ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. ఆయన ఆ స్థానంలో ఉన్నాడు. వివాదం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత అవసరం ఉంది. ఆయన ఆ బాధ్యాతాయుతమైన స్థానంలో ఉన్నారు. అందుకే ఆయన సరైన నిర్ణయం తీసుకొన్నాడు. ఆయన నాకు తమ్ముడు లాంటి వారని చెప్పడం లేదు. ఆయనకు సపోర్ట్ చేయడం లేదు. వాస్తవ పరిస్థితులను బేరిజు వేసుకొంటే.. అది తప్పుడు నిర్ణయం అని రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X