రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆలరించిన నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నటించిన తాజా చిత్రం క్లైమాక్స్. ఇటీవల రిలీజైన ఈ చిత్ర టీజర్లు, ట్రైలర్లు సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్‌లో మోడీని పోలిన గెటప్, మోడీ డౌన్ డౌన్ అనే నినాదాలు వివాదాస్పదంగా మారాయి.
ఇక కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై భవానీ శంకర్ కే దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం క్లైమాక్స్. రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఈ చిత్రంలో కరుణాకర్ రెడ్డి , రాజేశ్వర్ రెడ్డి లు నిర్మించిన ఈ చిత్రంలో సాషా సింగ్, శ్రీరెడ్డి, పృథ్వీ, శివ శంకర మాస్టర్, రమేష్ నటించారు. ఈ
చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ తో మార్చి 5న విడుదల కానుంది. వివాదాలకు ఈ సినిమాకు అధికారులు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ సరైన సమాధానం చెబుతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... ట్రైలర్ లోని విభిన్న కథనాలు ఇప్పటికే చిత్రంపై భారీ అంచనాను పెంచేసాయి. మార్చి 5న థియేటర్లలో విడుదలయ్యే మా క్లైమాక్స్ చిత్రం క్లైమాక్స్ ఎపిసోడ్ కచ్చితంగా అందర్నీ థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తుందని మాకు నమ్మకం ఉంది అని అన్నారు.
చిత్ర దర్శకుడు భవాని శంకర్ మాట్లాడుతూ "నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారితో ఇంతవరకు ఎవ్వరు తీయని కొత్త కథతో, ఎప్పుడు చూడని కథనాలతో, రాజేంద్రప్రసాద్ ఇటువంటి అద్భుతమైన పాత్రలు చేస్తాడా అనే విధంగా విచిత్ర కాన్సెప్ట్ తో "క్లైమాక్స్" సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. క్లైమాక్స్, మర్డర్ మిస్టరీతో పాటు ట్విస్ట్స్ మరియు బ్యాక్ డ్రాప్ కామెడీ, ఇంతవరకు మీరు ఎప్పుడు చూడని కథనాలు ఉంటాయి. మునుపెన్నడూ చూడని థ్రిల్లింగ్ క్లైమాక్స్ ని చూపించడానికి మా క్లైమాక్స్ తో మీ ముందుకు వచేస్తున్నాం మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం" అన్నారు.
సాంకేతిక నిపుణులు -
నిర్మాణం: కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్
నిర్మాతలు: రాజేశ్వర్ రెడ్డి , కరుణాకర్ రెడ్డి
దర్శకత్వం: భవాని శంకర్ కే
ఎడిటర్: బసవ పైడి రెడ్డి
మ్యూజిక్: రాజేష్, నిద్వాన
సినిమాటోగ్రఫీ: రవి కుమార్ నీర్ల
ఆర్ట్ డైరెక్టర్: రాజ్ కుమార్, రవి (ముంబై)
కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్


Click it and Unblock the Notifications











