డేవిడ్ వార్నర్ ను పచ్చిబూతులు తిట్టిన రాజేంద్ర ప్రసాద్.. స్టార్ క్రికెటర్ కి అవమానం!
టాలీవుడ్ స్టార్ నితిన్ 'రాబిన్ హుడ్' చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. విడుదలకు మరికొద్ది రోజులే బ్యాలెన్స్ ఉండటంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు.
రాబిన్ హుడ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాజరయ్యారు. ఆయన రాకతో ఈవెంట్ మరింత సందడిగా మారింది. తనదైన స్టైల్ లో డేవిడ్ వార్నర్ వేదికపై స్టెప్పులు కూడా వేశారు. ఈ సినిమాలో నటించడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇదంతా బానే ఉంటే టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ స్పీచ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది.

రాజేంద్ర ప్రసాద్ రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి గురించి తన అభిప్రాయాన్ని, వారి నటనపై తన విశ్లేషనను అందించారు. సినిమా కూడా అద్భుతంగా ఉండబోతుందని చెప్పారు. నితిన్, శ్రీలీలా, దర్శకుడు వెంకీ కుడుముల మంచి హార్డ్ వర్క్ చేశారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 'రాబిన్ హుడ్'లో స్పెషల్ రోల్ లో నటించిన స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి కూడా మాట్లాడారు.
రాబిన్ హుడ్ చిత్ర ఈవెంట్ కు డేవిడ్ వార్నరే స్పెషల్ గెస్ట్ లా హాజరయ్యారు. అలాంటిది రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ గురించి కించపరిచేలా మాట్లాడారు. ప్రపంచమంత అభిమానులను సంపాధించుకున్న ఆయన్ని పచ్చిబూతులు తిట్టారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఓరే డేవిండ్ వార్నరూ.. దొంగ ముం...డా కొడుకా... నువ్వు మాములోడివి కాదురోయ్.. అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అది విన్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. రాజేంద్ర ప్రసాద్ అలా మాట్లాడటం సరికాదని భావిస్తున్నారు.
అయితే రాజేంద్ర ప్రసాద్ అతి ఉత్సాహంతో డేవిడ్ వార్నర్ ను పొగుడుదామనుకున్నారు. అందుకే డేవిడ్ వార్నర్ గతంలో క్రికెట్ స్టేడియంలో చేసిన పుష్ప సిగ్నేచర్ స్టెప్ ను గుర్తు చేస్తూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ అది తప్పుగా వెళ్లింది. అసలు రాజేంద్ర ప్రసాద్ కావాలని అని ఉంటాడా? లేకా తొందరలో అలా స్టార్ క్రికెటర్ పై మాటలు జారారా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.
ఇక రాబిన్ హుడ్ చిత్రంలో డేవిడ్ వార్నర్ క్యామియో అపియరెన్స్ ఇవ్వబోతున్నారు. ఓ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారని, యాక్షన్ తో దుమ్ములేపబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సెట్స్ నుంచి విడుదలైన డేవిడ్ లుక్ కూడా వైరల్ గా మారింది. ఇక నాలుగు రోజుల షూటింగ్ కోసం డేవిడ్ వార్నర్ రూ.2.4 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారంట. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. నవీన్ ఎర్నేని, ఎలమంచి రవిశంకర్ నిర్మాతలు. 60 కోట్ల బడ్జెట్ తో గ్రాండ్ గా రూపొందించారు. నితిన్ హీరోగా నటించగా, టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా ఫిమేల్ లీడ్ లో నటించింది. కేతికా శర్మ స్పెషల్ సాంగ్ తో అలరించబోతోంది. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











