twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘తొలుబొమ్మలాట’ సినిమాతో మళ్ళీ మీ గుండెల్లో నేను ఉండిపోతాను : రాజేంద్రప్రసాద్

    |

    అచ్చ తెలుగు సినిమాను, పల్లెటూరి వాతావరణాన్ని, కనుమరుగువుతున్న బంధాల్ని, వాటి లోతుల్ని మరోసారి చూపించేందుకు ఓ చిత్రం రాబోతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆశిస్తున్న ప్రేక్షకులను కన్నుల విందు చేయడానికి తోలు బొమ్మలాట సిద్దమైంది. డా. రాజేంద్రప్రసాద్‌, విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా, శ్రీనివాస్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రం సుమదుర్గా క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య మాగంటి సమర్పణలో దుర్గాప్రసాద్‌ మాగంటి నిర్మించారు . విశ్వనాథ్‌ మాగంటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని సోమవారం రాత్రి హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా నిర్వహించింది.

    ఈ వేడుకలో నటకీరిటి డా . రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ..'ఆ నలుగురు ,మీ శ్రేయోభిలాషి, ఓ బేబీ ... ఇలా మంచి మంచి సినిమాల తరువాత నేను చేసిన మరో మంచి చిత్రం తోలుబొమ్మలాట. విశ్వనాథ్ మా అందరిని సెలెక్ట్ చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అతనికి కథ ప్రకారం ఏం కావాలో అదే తెరపై చూపించాడు. 'ఆ నలుగురు' నిర్మాత తరువాత అంతటి మంచి గుర్తింపు ఈ చిత్ర నిర్మాత దుర్గా ప్రసాద్ గారికి దక్కుతుంది. చాలా డేరింగ్‌తో మంచి సినిమాను నిర్మించారు. 'ఆ నలుగురు' 100 డేస్ ఈవెంట్‌లో డి.రామానాయుడు గారు ఒక మాట అన్నారు. వంద సినిమాలు చేసినా నాకు దక్కని ఇంత గొప్ప పేరు , నీకు ఈ ఒక్క సినిమతో వచ్చింది అన్నారు. ఇక ఆ రేంజ్ లో ఇప్పుడు దుర్గ ప్రసాద్ గారికి ఆ పేరు దక్కుతుందని భావిస్తున్నా. ఈ సినిమా సక్సెస్‌కి తెలుగు ప్రేక్షకులు కారణమవుతారని భావిస్తున్నా. 'తొలుబొమ్మలాట' సినిమాతో మళ్ళీ మీ గుండెల్లో నేను ఉండిపోతాను'అని అన్నారు.

    విశ్వంత్ మాట్లాడుతూ.. 'కమర్షియల్‌గా లెక్కలు ఎలా మారినా ఎమోషన్ యూనివర్సల్ పాయింట్ అని దర్శకుడు చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. ఇది ప్రతి ఒక్కరి కథ. సినిమా చూసిన తరువాతమీరే చెబుతారు. ఈ సినిమాకు ముందు నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నది మా నిర్మాత దుర్గా ప్రసాద్ గారు. సినిమా చూడగానే అద్భుతంగా ఉందని ఆయనే మొదటి క్రెడిట్ ఇచ్చారు. ఇక రాజేంద్రప్రసాద్ లాంటి గొప్ప యాక్టర్ తో నటించడం చాలా ఆనందంగా ఉంది. సినిమా కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. వారందరికీ తోలుబొమ్మలాట గుర్తింపు తేవాలని ఆశిస్తున్నా' అని అన్నారు.

    Rajendra Prasad Speech At Tholu Bommalata Pre Release Event

    హీరోయిన్ హర్షితా చౌదరి మాట్లాడుతూ.. 'కథలో రాజేంద్ర ప్రసాద్ ఒక హీరో అయితే, కథ కూడా మరో హీరో అని చెప్పాలి. సినిమా కథ గురించి ప్రతి ఒక్కరు అద్భుతంగా చెబుతున్నారు. అందుకు కారణం నిర్మాత, దర్శకుడు. వారికి ఇది మొదటి సినిమా. నాతో పాటు వారికి కూడా ఈ సినిమా మంచి బూస్ట్ ఇస్తుందని అనుకుంటున్నా. ఇలాంటి మంచి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవ్వడమనేది నా అదృష్టం. సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా'అని చెప్పారు.

    డైరెక్టర్ విశ్వనాధ్ మాగంటి మాట్లాడుతూ.. 'ఇటీవల కాలంలో ఫ్యామిలీ అంతా కూర్చోని చూసే సినిమాలు అంతగా రాలేవని విన్నాను. నేను నా ఫ్యామిలీతో కూర్చొని సినిమా చేయాలని అనుకున్నా. ఆ ఆలోచనతోనే మంచి కథను రాసుకున్నా. నా చిన్నప్పటి నుంచి నా ఫెవేరేట్ యాక్టర్ రాజేంద్రప్రసాద్ గారు. ఆయనతో వర్క్ చేయడం నా అదృష్టం. షూటింగ్ లో మరచిపోలేని క్షణాలు ఎన్నో ఉన్నాయి. సినిమాలో నటించిన నటీనటులు అలాగే టెక్నీషియన్స్ కి నా కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అని పేర్కొన్నారు .

    నిర్మాత దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ.. 'ముందుగా 42 సంవత్సరాల కెరీర్ ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రాజేంద్రప్రసాద్ గారికి హార్దిక శుభాకాంక్షలు తెలువుతున్నాను. నా చిన్నప్పటి నుంచి ఆయనకు నేను అభిమానిని . లైఫ్ లాంగ్ ఇలానే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నా. డైరెక్టర్ విశ్వనాథ్ కొన్నేళ్ల క్రితం నాకు తొలుబొమ్మలాట కథ వినిపించినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. చిత్ర యూనిట్ లో ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. అందరికి ఈ సినిమా మంచి గుర్తింపు అందించాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు.

    English summary
    Tholu Bommalata Movie pre Relaese Event Becime grand Success. Rajendra Prasad Given Emotional Speech On Stage. Viswanth And Harshitha Chowdhary Are main Lead In The Movie. This Movie Is Directed By Vishwanath Maganti And going To be Relaesed On 22nd November.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X