సోడాల రాజుగా రాజేంద్ర ప్రసాద్.. ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటోన్న తోలు బొమ్మలాట

హీరోయిజం, కుళ్లు జోకులు, హీరోయిన్ ఎక్స్‌పోజింగ్స్‌తో వస్తోన్న రొటీన్ సినిమాలను చూసి విసిగెత్తిపోయిన ప్రేక్షకులకు కాస్త ఊరటనిచ్చే అచ్చమైన తెలుగు సినిమా రాబోతోంది. పల్లె వాతావరణం, కుటుంబ కలహాలు, ప్రేమలు, బావామరదళ్ల సరసాలు ఇలా తెలుగులోగిళ్లలను కళ్లకు కట్టినట్టు చూపించేందుకు తోలు బొమ్మలాట అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ నటిస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

మోషన్ పోస్టర్‌తోనే హైప్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్.. పాటలతోనూ మంచి స్పందన తెచ్చుకుంది. పల్లెటూరి వాతావరణం, కనుమరుగవుతున్న బంధాలు, మమతలను మళ్లీ గుర్తు చేసేందుకు తోలు బొమ్మలాట రాబోతోంది. శతమానంభవతి లాంటి చిత్రం తరువాత మళ్లీ అందర్నీ మెప్పించే చిత్రమవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Rajendra Prasad Tholu Bommalata Movie Trailer Released

తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్.. సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. సోమరాజు తన పేరని.. అందరూ సోడాల రాజు అని పిలుస్తారని పరిచయం చేసుకున్న రాజేంద్ర ప్రసాద్ అన్ని రకాలు ఎమోషన్స్ పండించినట్లు కనిపిస్తోంది. కామెడీతో నవ్వించడమే కాదు ఎమోషనల్ సీన్స్‌లో ఏడ్పించనున్నాడని తెలుస్తోంది. బావామరదళ్ల పెళ్లి జరిపించడానికి, తాత పడే తాపత్రయం, దానికి కోసం సాయం చేసే వెన్నెల కిషోర్ పాత్ర ఇలా ప్రతీ ఒక్కటి ఆకట్టుకుంది. ఈ చిత్రానికి విశ్వనాథ్ మాగంటి దర్శకత్వం వహించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X