అచ్చమైన తెలుగు సినిమా.. ఆకట్టుకుంటోన్న తోలు బొమ్మలాట మోషన్ పోస్టర్
వెండితెరపై అచ్చమైన తెలుగు సినిమాలను చూసే చాలా కాలమే అవుతుంది. రివేంజ్ డ్రామాలు, బోల్డ్ కంటెంట్లతో సినిమాలు వస్తుండటంతో ఓ చక్కటి సినిమాను చూసే అవకాశమే లేకుండా పోతోంది. బంధాలతో పెనవేసుకున్న చిత్రాలు, గుండెను తాకే సన్నివేశాలు, కన్నీరు పెట్టించే భావోద్వేగాలతో ఇంటిల్లిపాది కూర్చుని చూసే సినిమాలు రావడం లేదు.
అయితే అలా ఫీలయ్యే ప్రేక్షకలు కాస్త ఉపశమనం కలిగించేందుకు ఓ సినిమా వస్తోంది. ఆ మధ్య శతమానంభవతి లాంటి సినిమా వచ్చి కాస్త రీలీఫ్ అయ్యేలా చేసింది. అనవరసమైన హీరోయిజం, భారీ భారీ డైలాగ్‌లు, పెద్దపెద్ద సెట్‌లు వేసిన చిత్రాల కంటే అలాంటి సినిమాలే ప్రేక్షకుల మనుసును తాకుతాయి. అందుకే ఆ సినిమాకు జాతీయ అవార్డు కూడా లభించింది.

అందరి హృదయాలను స్పృశించేందుకు మళ్లో అలాంటి ఓ చిత్రం మన ముందుకు రాబోతోంది. ఓ చిన్న ఊరు.. అందులో ఓ పెద్ద కుంటుంబం.. ఇంటి పెద్ద.. ఆస్తి గొడవలు.. పంపకాలు.. ఇలా ప్రతీ ఇంట్లో జరిగే కథతో తోలుబొమ్మలాట అనే చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
తాజాగా రిలీజ్ చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. రాజేంద్ర ప్రసాద్ ప్రసాద్ ముఖ్యపాత్రలో వస్తోన్న ఈ చిత్రానికి విశ్వనాథ్ మాగంటి దర్శకత్వం వహిస్తున్నారు. సుమ దుర్గ క్రియేషన్స్‌పై మాగంటి దుర్గప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











