సెన్సార్‌పై దర్శకుడి వార్.. ‘రక్తం’పై అభ్యంతరమా?

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, జాతీయ‌, అంత‌ర్జాతీయ అవార్డు గ్ర‌హీత రాజేష్ టచ్ రివర్ తాజాగా రూపొందించిన ర‌క్తం చిత్రానికి సెన్సార్ స‌భ్యుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సినిమాలోని కొన్ని సీన్లపై అభ్యతరం వ్యక్తం చేయడంపై దర్శకుడు రాజేష్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఐదు ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు, ఐదు ఇతర నామినేష్ల‌కు ఎంపికైన ఈ చిత్రంపై సెన్సార్ స‌భ్యులు తెలిపిన అభ్యంత‌రాలు సంతృప్తికరంగా లేవ‌ని రాజేష్ టచ్ రివర్ అన్నారు. ఎలాంటి అస‌భ్య‌త లేకుండా, మాన‌వీయ కోణంలో చిత్రీరించిన ఈ చిత్రంలోని సన్నివేశాలకు సెన్సార్ స‌భ్యులు చెప్పిన అభ్యంత‌రాలు స‌రైన‌వి కావు. సెన్సార్ గైడ్‌లైన్స్ 2(12) ప్ర‌కారం క‌ట్ ఇచ్చామ‌ని రిపోర్ట్ పంపించారు. వాళ్లు సూచించిన గైడ్ లైన్స్ చ‌ద‌వ‌గానే నాకు చాలా ఆశ్చ‌ర్య‌మైంది. ఇద్ద‌రు విప్ల‌వ‌కారుల మ‌ధ్య జ‌రిగే సీరియ‌స్ సంభాష‌ణ అది. వాళ్లు ఇచ్చిన గైడ్ లైన్స్ సెక్స్‌వ‌ల్‌గా త‌ప్పుదారి ప‌ట్టించేదేంటో నాకు అర్థం కాలేదు అని ఆయన అన్నారు.

Rajesh Touch River war on Censor board for Raktham movie

సామాజిక ప‌రివ‌ర్త‌న కోసం ర‌క్తం చిందించ‌డం అవ‌స‌ర‌మా? అనే సున్నితమైన క‌థాంశంతో సాగే ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు చెప్పిన అభ్యంత‌రాలు చిత్ర క‌థ‌ను చిన్నాభిన్నం చేసేలా వున్నాయి. అందుకే నేను ట్రిబ్యున‌ల్ కు వెళుతున్నాను అన్నారు.

Rajesh Touch River war on Censor board for Raktham movie

రక్తం చిత్రంలో బెన‌ర్జీ, సంజు శివ‌రామ్‌, మ‌ధుశాలిని, స‌న‌, జాన్ కోటోలీ త‌దిత‌రులు న‌టించిన

ఈ చిత్రానికి మాట‌లుః న‌ర‌సింహ కుమార్‌, పాట‌లుః శివ‌సాగ‌ర్‌, ర‌వి కే పున్నం, న‌ర‌సింహా కుమార్‌, ఎడిటింగ్ః శ‌శి కుమార్‌, సంగీతంః వివేక్ మ‌హాదేవ్‌, కెమెరాః జే.డి.రామ తుల‌సి, స‌హ నిర్మాతః మున్షీ రియాజ్ అహ‌మ్మ‌ద్‌, నిర్మాతః డా.. సునీతాక్రుష్ణ‌న్‌, క‌థ‌, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వంః రాజేష్ టచ్ రివ‌ర్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X