Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రజనీ 2.0కి చైనీస్ టైటిల్ ఏంటో తెలుసా.. భారీ ఎత్తున విడుదల!
సూపర్ స్టార్ రజనీకాంత్, దిగ్గజ దర్శకుడు శంకర్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం 2.0. గత ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. భారత సినిమా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన చిత్రం ఇది. అందాల తార అమీజాక్సన్ ఈచిత్రంలో లేడి రోబోగా నటించింది.
ప్రస్తుతం ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేయబోతున్నారు. కాగా 2.0 చైనీస్ వర్షన్ కు ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు. 2.0 : రిసర్జెన్స్ అనే టైటిల్ తో ఈ చిత్రం చైనాలో విడుదల కాబోతోంది. చైనా వ్యాప్తంగా ఈ చిత్రాన్ని 56 వేల స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారంటే ఎంత భారీ ఎత్తున విడుదలవుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని హెచ్ వై మీడియా వారు చైనాలో విడుదల చేస్తున్నారు.
రజనీకాంత్ కు ఉన్న అంతర్జాతీయ క్రేజ్ తో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక్కడ లోకల్ గా మాత్రం 2.0 ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మరి రజినీకాంత్ చిట్టి రోబోగా చైనాలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.