రజినీకాంత్ రాసిన కథతో హిట్ కొట్టిన టాలీవుడ్ స్టార్ హీరో.. బొమ్మ చూస్తే గూస్‌బంప్సే?
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పెద్ద ఫ్యామిలీలలో మంచువారి కుటుంబం అంటే తెలియని వారు ఎవరూ ఉండకపోవచ్చు. ఇప్పుడంటే చాలా మంది ట్రోల్స్ చేస్తారు కానీ. మన తెలుగు సినిమా చరిత్రలో మోహన్ బాబు సెట్ చెందిన బెంచ్ మార్క్ అప్పట్లో మామూలు లెవల్లో ఉండేవి కాదు. తన సినిమాలు, తన డైలాగ్స్ అయితే మరీ క్రేజ్ ఎక్కించేవి.
అందుకే డైలాగ్స్ లో తనని డైలాగ్ కింగ్ అని, తన సినిమాల వసూళ్లతో కలెక్షన్ కింగ్ అనే బిరుదు కూడా మోహన్ బాబు సొంతం చేసుకున్నారు. కానీ తర్వాత మాత్రం తన డౌన్ ఫాల్, తన వారసుల ఎంట్రీ ఇలా ఒక తరాన్ని సక్సెస్ గా చూసి తర్వాత తరానికి చేరుకున్నారు మోహన్ బాబు. కాగా ఆయన కెరీర్లో చాలా చిత్రాలు అనేకమంది స్టార్స్ తో చేసినవి ఉన్నాయి. తాను సోలోగా భారీ హిట్స్ కొట్టినవి కూడా ఉన్నాయి.

కాగా అలాంటి చిత్రాల్లో ఓ పవర్‌ఫుల్ సినిమా అంటే చాలా మందికే తెలిసి ఉంటుంది. మరి ఆ చిత్రమే "రాయలసీమ రామన్న చౌదరి". 2000 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో భారీ హిట్ అయ్యి మంచి వసూళ్లు కూడా అందుకుంది. అసలు ఆ సినిమా కథ కానీ, మోహన్ బాబు పాత్ర కానీ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇప్పటికీ జనరల్ ఆడియెన్స్ ఈ సినిమాని చూసే విధంగా మంచి ఇంటెన్స్ సన్నివేశాలు కనిపిస్తాయి.
అయితే ఈ సినిమా విషయంలో మోహన్ బాబు రీసెంట్‌గా ఒక ఊహించని షాకింగ్ ఫ్యాక్ట్ ని షేర్ చేసుకున్నారు. ఈ చిత్రానికి సూపర్ స్టార్ రజినీకాంత్ కథ అందించారట. తాను రాసిన కథ, తన కోసం ఇచ్చిన కథ అంటూ మోహన్ బాబు క్రేజీ ట్విస్ట్ ఇచ్చారు. కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో మోహన్‌బాబు మంచి మిత్రులన్న సంగతి అందరికీ తెలిసిందే. మన తెలుగులో చాలా మంది ప్రెజెంట్ మోహన్ బాబు అంటే ఏదేదో అనుకుంటారు కానీ తన నెట్‌వర్క్ మాత్రం మామూలు లెవెల్లో ఉండదు.
దీనితో చాలా సార్లు రజినీకాంత్‌ని కూడా ఏకవచనంతో పిలిచినప్పుడు చాలామంది ఆయనపై పలు కామెంట్స్ కూడా చేశారు. కానీ తర్వాత రజినీతో కలిసి క్లోజ్ ఉన్న పిక్ పోస్ట్ చేసి బాండింగ్ ఎంత బలంగా అనేది చూపించారు. ఈ తర్వాత తాను రజినీకాంత్ కూడా పలు సందర్భాలలో అతను తన ఫ్రెండ్ అంటూ మోహన్ బాబుపై పలు పోస్ట్ లు పెట్టడం వైరల్ గా మారింది.
రజినీకాంత్ కథ అందించిన కథతో వచ్చిన రాయలసీమ రామన్న చౌదరి తన కెరీర్లో 500వ సినిమా అని మోహన్ బాబు గుర్తుచేసుకున్నారు. ఇది ఒక మెమొరబుల్ హిట్‌గా నిలిచింది అని తన క్యారెక్టర్‌ని సురేష్ కృష్ణ అద్భుతంగా తెరకెక్కించారని మోహన్ బాబు తెలిపారు. అయితే రాయలసీమ రామన్న చౌదరికి తలైవా కథ ఇచ్చారన్న సంగతి మాత్రం ఇపుడే చాలా మందికి తెలిసింది అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











