జనతా కర్ఫ్యూ.. మద్దతుగా నిలిచిన కోలీవుడ్
కరోనా కట్టడికి ప్రధాన మంత్రి నరేంద్ర మోది ప్రకటించిన వినూత్న కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. జనతా కర్ఫ్యూ అంటూ ఆదివారం (మార్చి 22) ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని పిలుపునిచ్చాడు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని సూచించాడు. ఈ విషయాన్ని తెలియని వారందరికీ చెప్పాలని, అందరూ ఇంట్లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలనే సందేశాన్ని ఇచ్చారు.
జనతా కర్ఫ్యూపై అవగాహన కల్పించేందుక బాలీవుడ్, టాలీవుడ్ సెలెబ్రిటీలు ముందుకు వచ్చారు. అమితాబ్,అక్షయ్ కుమార్ వంటి హీరోలు వీడియో సందేశాన్ని పంపించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు కూడా వీడియో ద్వారా ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. తాజాగా కోలీవుడ్ ప్రముఖ హీరోలు కూడా జనతా కర్ఫ్యూపై స్పందించారు.

కరోనా ప్రస్తుతం రెండో స్టేజ్‌లో ఉందని, ప్రధాని ప్రకటించిన జనతా కర్ఫ్యూకు అందరూ మద్దతు తెలపాలని సూపర్ స్టార్ రజినీ, కమల్ హాసన్ కోరారు. కరోనా 12 గంటలు బతుకుతుందని, అందరూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఇంట్లోనే ఉండండని తెలిపాడు. అందరూ స్వీయనిర్భందాన్ని విధించుకోవాలని వీడియో ద్వారా సందేశాన్ని పంపారు.


Click it and Unblock the Notifications











