అదే నా డ్రీమ్ రోల్.. పోలీస్ పాత్రలను చేయడం నచ్చదు.. రజినీ కామెంట్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ అంటూ గ్యాంగ్‌స్టర్‌లను మట్టు బెట్టేందుకు వస్తున్నాడు. ముంబై నేపథ్యంలో సాగే ఈ కాప్ డ్రామాలో అదిత్యా అరుణాచలం పాత్రలో రజినీ రెచ్చిపోయినట్లు ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ పెంచేందుకు చిత్ర యూనిట్ సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే ముంబైలో ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో రజినీ మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించాడు.

ఆ కోరిక అలానే ఉండిపోయింది..

ఆ కోరిక అలానే ఉండిపోయింది..

తాను మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని కాబట్టి అక్కడా ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. మరాఠా సినిమాలో నటిస్తానని అన్నారు. ఇంతకుముందు ఓసారి మరాఠాలో ఆఫర్ వచ్చినా అది వర్కవుట్ కాలేదని, కానీ మరాఠా చిత్రం చేయాలన్న కోరిక మాత్రం అలానే ఉండిపోయిందని చెప్పుకొచ్చాడు.

నటన అనేది ఫ్యాషన్

నటన అనేది ఫ్యాషన్

రజనీ ఇంత సాధించినా ఏ కారణం వల్ల ఇంకా సినిమాలు చేస్తున్నారు.. విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అడిగితే.. ఫ్రాంక్ గా చెప్పాలంటే డబ్బు కోసమే చేస్తున్నాను అంటూ నవ్వేసిన రజనీ.. నటన అనేది తనకు ఫ్యాషన్ అని అసలు సంగతి చెప్పాడు. ఏ పని చేసినా అది మనసు పెట్టి ప్రేమగా చేయాలని, ఫలితం అదే వస్తుందని రజనీ తెలిపాడు.

పోలీస్ పాత్రలంటే నచ్చదు..

పోలీస్ పాత్రలంటే నచ్చదు..

తనకు పోలీస్ పాత్రలు చేయడం నచ్చదని పేర్కొన్నాడు. అలాంటి పాత్ర చేయాలంటే చాలా బాధ్యతాయుతంగా ఉండాలని, తనకు సులభంగా చేసే పాత్రలంటే ఇష్టం కానీ మురుగదాస్ వైవిధ్యమైన కథతో తన దగ్గరకి వచ్చాడు కాబట్టి ఒప్పుకున్నానని తెలిపాడు. ఇప్పటివరకు చాలా జోనర్స్ లో సినిమాలు చేశాను కానీ నా డ్రీమ్ రోల్ మాత్రం చేయలేకపోయానని తన మనసులోని కోరికను చెప్పుకొచ్చాడు.

 అదే డ్రీమ్ రోల్..

అదే డ్రీమ్ రోల్..

ఇప్పటివరకూ దాదాపు 160 సినిమాలు చేశాను, 45 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాను కానీ డ్రీమ్ రోల్ మాత్రం చేయలేకపోయానని ఆవేదన చెందాడు. ఇంతకీ రజినీ డ్రీం రోల్ ఏంటంటే.. ‘ట్రాన్స్‌జెండర్' క్యారెక్టర్. వెండితెరపై ట్రాన్స్‌జెండర్ గా కనిపించాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X