రజనీ కూలి.. తారక్, హృతిక్ వార్ 2.. భారీగా టికెట్స్ ధరలు.. ఏ స్క్రీన్స్ లో ఎంతంటే?
మరో 3 రోజుల్లో ఇండియన్ థియేటర్లలో రెండు భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ కూలి, వార్ 2 చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రాలు రిలీజ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో రెండు చిత్రాలకు భారీగా ఆడియెన్స్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కూలి, వార్ 2 చిత్రాలకు సంబంధించిన టికెట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఏఏ సినిమా రేట్స్ ఎలా ఉన్నాయి. మల్టిప్లెక్స్ లో ఎంత? సింగిల్ స్క్రీన్స్ ల్లో ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
భారీగా పెరిగిన టికెట్స్ ధరలు..
రజనీకాంత్, అక్కినేని నాగార్జున కూలి చిత్రం రాబోతుండటం, జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2తో థియేటర్లలోకి రాబోతున్నారు. పైగా ఒకే రోజు ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా టికెట్ల రెట్లు ఇలా ఉన్నాయి. మల్టిప్లెక్స్ ల్లో కూలి చిత్రానికి గాను ఒక్క టికెట్ కు రూ.350 ధరను నిర్ణయించారు. ఇక వార్ 2 చిత్రానికి 413 రూపాయలు ఒక్క టికెట్ ధరగా ఉండటం గమనార్హం.

సింగిల్స్ స్క్రీన్స్ ల్లో..
మల్టిప్లెక్స్ ల్లో అత్యధిక రేట్లు ఉండటంతో పాటు సింగిల్ స్క్రీన్ రేట్లు కూడా భారీగానే పెరిగాయి. రజనీకాంత్ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ కూలి చిత్రానికి రూ.200 ఉండగా, జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ భారీ యాక్షన్ ఫిల్మ్ వార్ 2కు రూ.250 టికెట్ ధరను నిర్ణయించారు. ఇక రెండు చిత్రాల్లో రజనీకాంత్ చిత్రానికే టికెట్ ధరలు తక్కువగా ఉండటం గమనార్హం. దీంతో ఆడియెన్స్ కూడా కూలి చిత్రానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.
అడ్వాన్డ్స్ బుకింగ్స్..
రజనీకాంత్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి స్టార్ కాస్ట్ ఉండటం.. పైగా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేషన్ కనగరాజ్ దర్శకత్వం వహించడంతో కూలి చిత్రంపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ క్రమంలో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 2.5 లక్షల టికెట్లు బుక్ కాగా, కూలికి 11 కోట్ల రూపాయల ఇండియా గ్రాస్ వసూలైందని, ఇక వార్ 2కు 56 వేల టికెట్లు బుక్ కావడంతో 4.5 కోట్ల రూపాయల ఇండియా గ్రాస్ వచ్చిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
భారీ బడ్జెట్ తో కూలి, వార్ 2..
కూలి చిత్రాన్ని కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు నిర్మించారు. కళానిధి మారన్ ఈ చిత్రాన్ని రూ.350 కోట్లతో రూపొందించారు. ఇక వార్ 2 చిత్రాన్ని బాలీవుడ్ టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో నిర్మాత ఆదిత్య చోప్రా రూ.400 కోట్ల బడ్జెట్ తో నిర్మించారని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇక ఈ రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్ డే ఎలాంటి నెంబర్స్ ను రాబడుతాయనేది ట్రేడ్ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది.


Click it and Unblock the Notifications











