రికార్డ్ సెట్ చేసిన రజనీకాంత్ కూలి.. ఓవర్సీస్ రైట్స్ కు భారీ ధర.. ఎన్ని కోట్లో తెలుసా?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయస్సులోనూ యాక్షన్ చిత్రాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. భారీ చిత్రాలకు సైన్ చేస్తూ షాకిస్తున్నారు. యంగ్ హీరోలకు షాకిచ్చేలా థియేటర్లలో దుమ్ములేపుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సెట్ చేస్తున్నారు. చివరిగా జైలర్ చిత్రంతో భారీ బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. అదే సమయంలో రూ.210 కోట్లు పారితోషియం తీసుకున్న ఇండియాస్ హై పెయింగ్ యాక్టర్ గానూ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'కూలి' చిత్రంతో రిలీజ్ కు ముందే మరో రికార్డ్ ను సెట్ చేశారు. ఆ వివరాలు ఆసక్తికరంగా మారాయి.

భారీ బడ్జెట్ తో కూలి చిత్రం..
తమిళ చలన చిత్ర పరిశ్రమలో ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు లోకేషన్ కనగరాజ్. ఆయన దర్శకత్వ ప్రతిభకు కేవలం కోలీవుడ్ నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందాయి. ఈ క్రమంలోనే లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేశారు. ఆడియెన్స్ లోనూ ఆసక్తిని పెంచారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రజనీకాంత్ తో కూలి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ గ్రూప్స్ కు చెందిన సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిథి మారన్ నిర్మిస్తున్నారు. రజనీ లోకేష్ చిత్రానికి రూ.350 కోట్లు వెచ్చించారని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల కాబోతోంది. భారీ తారాగణం కూడా నటించడంతో సినిమాకు అధికమొత్తంలోనే ఖర్చైంది.

Rajinikanth Coolie Movie overseas Distribution rights sold for a huge price

రిలీజ్ కు ముందే కూలి రికార్డ్..
రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లోని కూలి చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. అయితే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో సినిమా బిజినెస్ కు సంబంధించిన పనులను వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను అయ్ గరన్ ఇంటర్నేషనల్ సంస్థ భారీ ధరకు దక్కించుకుంది. కేవలం ఓవర్సీస్ రైట్స్ కు రూ.68 కోట్లు చెల్లించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. ప్రస్తుతం ఈ చిత్రానికే ఓవర్సీస్ రైట్స్ ద్వారా అత్యధిక ధర వచ్చిందని కోలీవుడ్ ప్రముఖులు తెలుపుతున్నారు.

కూలిపై భారీ అంచనాలు..
రజనీకాంత్ ఇప్పటికే జైలర్ చిత్రంతో భారీ హిట్ అందుకోవడంతో కూలి చిత్రంపై భారీ అంచనాలు నెలకున్నాయి. మరోవైపు లోకేష్ కనగరాజ్ మరింత మాస్ గా రజనీని చూపించబోతున్నట్టు ఇప్పటికే విడుదల గ్లింప్స్ తెలియజేస్తోంది. అలాగే అనిరుధ్ రవిచంద్ర అందించిన బిజీఎం కూడా దుమ్ములేపే రేంజ్ లో ఉంది. ఫలితంగా సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తుండటంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకున్నాయి.

స్పెషల్ సాంగ్ లో బుట్టబొమ్మ..
కూలి చిత్రంలో రజనీకాంత్ సరసన స్టార్ హీరోయిన్ శృతి హాసన్ నటిస్తుండటం విశేషం. కాగా స్పెషల్ సాంగ్ లో గ్లామర్ బాంబ్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే నటించింది. ఈ సాంగ్ సాధారణం కంటే భిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ క్యామియో అప్పియరెన్స్ ఇవ్వబోతుండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X