twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సౌత్ ఇండియా నుంచి టాప్ ప్లేస్.. మొదటిసారిగా త్రివిక్రమ్.. మహేష్‌ను వెనక్కి నెట్టిన ప్రభాస్

    |

    గత ఎనిమిదేళ్లుగా ఫోర్బ్స్ ఇండియా ప్రకటిస్తోన్న టాప్-100 సెలబ్రిటీల జాబితాలో ఈ ఏడాదిగానూ అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఖాన్‌ల హవాను వెనక్కి నెట్టి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. గతేడాది అగ్రస్థానంలో ఉన్న సల్మాన్ మూడో స్థానంలోకి పడిపోవడం, అక్షయ్ రెండో స్థానానికి ఎగబాకడం లాంటివి చోటు చేసుకున్నాయి. ఇదంతా ఉత్తరాదికి సంబంధించినది కాగా.. మన వరకు వచ్చేసరికి సూపర్ స్టార్ రజినీ అందరి కంటే ముందు వరుసలో ఉన్నాడు.

     దక్షిణం నుంచి టాప్ ప్లేస్..

    దక్షిణం నుంచి టాప్ ప్లేస్..

    వరుస సినిమాలతో బిజీగా ఉన్న రజినీ రెమ్యూనరేషన్‌గా భారీ మొత్తాన్నే అందుకుంటున్నాడు. ఈ ఏడాది పేట్టా సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ టాప్ 100లో 13వ స్థానంలో నిల్చున్నాడు. దక్షిణాది నుంచి టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. దక్షిణాదిన ఎంత మంది స్టార్లు ఉన్నా.. రజినీ తరువాతే ఎవరైనా అని మరోసారి నిరూపించుకున్నాడు.

    బాహుబలి, సాహోతో ప్రభాస్..

    బాహుబలి, సాహోతో ప్రభాస్..

    బాహుబలి, సాహో లాంటి ప్యాన్ ఇండియా చిత్రాలతో ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగింది. ప్రభాస్ అంటే కేవలం టాలీవుడ్ స్టార్ కాదు.. ఇండియన్ స్టార్ అనే రేంజ్‌కు ఎదిగాడు. అంతలా పాపులార్టీ తెచ్చుకున్న ప్రభాస్ టాలీవుడ్ నుంచి టాప్ ప్లేస్‌ను దక్కించుకున్నాడు. ప్రభాస్ 44వ స్థానంలో ఉండగా.. మహేష్ బాబు 54వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

    మొదటి సారిగా గురూజీ

    మొదటి సారిగా గురూజీ

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మొదటి సారిగా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. ఈ ఏడాది అరవింద సమేత చిత్రంతో భారీ హిట్టు కొట్టిన గురూజీ.. 77వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సందర్భంలో త్రివిక్రమ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.

    దక్షిణాది ప్రముఖుల స్థానాలు..

    దక్షిణాది ప్రముఖుల స్థానాలు..

    దక్షిణాది నుంచి కొంత మంది ప్రముఖుల స్థానాలు ఇలా ఉన్నాయి.. డైరెక్టర్ శివ 80, కమల్ హాసన్ 56, మోహన్ లాల్ 27, దళపతి విజయ్ 47, ధనుష్ 64, మమ్ముట్టి 62, శంకర్ 55, కార్తీక్ సుబ్బరాజ్84, అజిత్ 52, ఏఆర్ రెహ్మాన్ 16 స్థానాల్లో నిలిచారు.

    English summary
    Rajinikanth Is Top From South Indian Actors In Forbes India Top 100 celebraties List. In This List Trivikram Got 77th Postion For The First Time. And Prabhas Performs Better Than Mahesh Babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X