శ్రీదేవీతో పెళ్లి ప్రపోజల్.. రజనీ కాంత్‌ను అడ్డుకొన్న అపశకునం ఏంటో తెలుసా?

సినిమా రంగంలో కలిసి ట్రావెల్ చేయడం, సినిమాల్లో కలిసి నటించడం వల్ల తారల మధ్య ఆకర్షణ, ప్రేమ పుట్టడం సహజం. అలా ప్రేమలో పడిన వారు డేటింగ్ పరిమితం కావొచ్చు.. లేదా వారి ప్రేమను రెండు అడుగుల ముందుకు నడిపించి ఏడడుగల వరకు తీసుకెళ్లడం లాంటి సంఘటనలు చాలానే జరిగాయి. జయ బాధురి-అమితాబ్ దంపతుల నుంచి నాగార్జున- అమల, అలాగే నేటితరం జంట విజయ్ దేవరకొండ నుంచి రష్మిక జంట వరకు ఇలాంటి సంఘటనలతోనే ఒక్కటయ్యారు. అయితే శ్రీదేవీ-రజనీకాంత్ మధ్య ప్రేమ పెళ్లి వరకు రాకపోవడానికి ఓ అపశకునం కారణమనే విషయం ప్రస్తుతం బయటకు వచ్చింది. రజనీని పెళ్లి చేసుకోకుండా ఆపేసిన ఆ సంఘటన ఏమిటనే వివరాల్లోకి వెళితే..

80 దశకం నుంచి 90 దశకం వరకు శ్రీదేవీతో అగ్ర హీరోలందరూ నటించారు. కమల్, రజనీకాంత్, చిరంజీవి, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, శోభణ్ బాబు, కృష్ణ, చంద్రమోహన్ లాంటి వాళ్లు ఆమెతో నటించి భారీ హిట్స్ సొంతం చేసుకొన్నారు. అయితే శ్రీదేవీతో అఫైర్ వార్తలు ఎక్కువగా కమల్, రజనీకాంత్‌తోనే ముడిపడ్డాయి. కానీ ఎక్కువగా రజనీ, శ్రీదేవీ ప్రేమ కథ గురించి చాలా ఎక్కువగానే చెప్పుకొంటారు అని సినీ వర్గాలు చెప్పుకొంటారు.

Rajinikanth Marriage proposal to Sridevi

అయితే శ్రీదేవీ, రజనీకాంత్ మధ్య ప్రేమాయణం పీకల్లోతు వ్యవహారంగా మారింది. వారిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగడం అప్పట్లో ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ అయింది. గాసిప్ మ్యాగజైన్స్ వారి లవ్ అఫైర్ గురించి సీరియల్‌లా రాశారు. అంతా వారిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమని అనుకొన్నారు. శ్రీదేవీకి కూడా రజనీకాంత్ అంటే ఇష్టం. అతడిని పెళ్లి చేసుకోవాలని కూడా ఆమె డిసైడ్ అయిందని చెప్పుకొంటారు.

Also Read
Samantha: అక్కినేని ఫ్యామిలీకి అండగా సమంత.. డైవోర్స్‌ తర్వాత అన్ని మరిచిపోయి!
Samantha: అక్కినేని ఫ్యామిలీకి అండగా సమంత.. డైవోర్స్‌ తర్వాత అన్ని మరిచిపోయి!

అయితే శ్రీదేవీతో పెళ్లి విషయం చర్చించుకోవాలని రజనీకాంత్ డిసైడ్ అయ్యారట. ఆ క్రమంలో ఆమె ఇంటికి ఓ రోజు వెళ్లి మ్యారేజ్ ప్రపోజల్ గురించి డిస్కస్ చేయాలని అనుకొన్నారట. దాంతో ఓ రోజు మంచి ముహుర్తం, శుభ గడియలు చూసుకొని శ్రీదేవీ ఇంటికి వెళ్లాలని డిసైడ్ చేసుకొన్నారట. ఓ రోజు శుభ గడియలు చూసుకొని శ్రీదేవీ ఇంటికి రజనీకాంత్ చేరుకొన్నారు.

Recommended For You
10 కోట్ల బడ్జెట్.. 7 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్లు.. దుమ్మురేపుతున్న చిన్న సినిమా!
10 కోట్ల బడ్జెట్.. 7 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్లు.. దుమ్మురేపుతున్న చిన్న సినిమా!

రజనీకాంత్‌ను చూడగానే శ్రీదేవీ, ఆమె కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. కుశల ప్రశ్నలు వేసుకొన్న తర్వాత రజనీ అసలు విషయాన్ని చెప్పాలని అనుకొంటున్నారట. అ్తలోనే పవర్ కట్ కారణంగా కరెంట్ పోయి ఇళ్లంతా చీకటిగా మారిందట. ఆ సంఘటనను రజనీ అపశకునంగా ఊహించుకొన్నారట. తన మ్యారేజ్ ప్రపోజల్ ఇలాంటి పరిస్థితుల్లో చెప్పడం మంచిది కాదని వెనక్కి వచ్చారు. అలా కరెంట్ పోవడం వల్ల మ్యారేజ్ ప్రపోజల్ వాయిదా వేసుకోవడం జరిగింది. ముహుర్తాలను, జాతకాలను, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా పాటించే రజనీ ఆ విషయాన్ని మళ్లీ ఆమె వద్ద తీసుకు రాలేదట. అలా శ్రీదేవీని పెళ్లి చేసుకొనే అవకాశాన్ని ఓ అపశకనం కారణంగా రజనీ మిస్ అయ్యాడనే విషయం సన్నిహితులు చెబుతుంటారు.

More from Filmibeat

Read more about: sridevi rajinikanth kollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X