చాలా ఏళ్ల తర్వాత ఆ పాత్రలో రజనీకాంత్.. ఫాన్స్‌కు పండగే!
సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. గత ఏడాది రజిని కాలా, 2.0 చిత్రాలతో సందడి చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించన పేట చిత్రం విడుదలయింది. ప్రస్తుతం రజని సంచలన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నారు.మురుగదాస్ గత ఏడాది సర్కార్ చిత్రంతో సంచలనం సృష్టించారు. ఆ చిత్రం వివాదాలతో పాటు, రికార్డులు కూడా క్రియేట్ చేసింది. తాజాగా రజని చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.
క్రేజీ కాంబినేషన్ కావడంతో రజని, మురగదాస్ చిత్రం గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం రజనీకాంత్ ఈ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో రజని పలు చిత్రాల్లో పోలీస్ అధికారి పాత్రల్లో నటించారు. వాటిలో పాండియన్, కోడి పరాకథు లాంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి.

చాలా రోజుల తర్వాత రజని పోలీస్ డ్రెస్ లో కనిపిస్తే ఆయన అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం. కానీ రజని, మురుగదాస్ చిత్రం విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే చిత్రానికి సంబంధించి రజని ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తారని వార్తలు వచ్చాయి. నర్కాలి అనే టైటిల్ ని దర్శకుడు పరిశీలిస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది.


Click it and Unblock the Notifications











