twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ ఫ్యాన్స్‌కు శుభవార్త.. సెప్టెంబర్ 13న రోబో 2.0..

    By Rajababu
    |

    ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు శుభవార్త. సంచలన దర్శకుడు శంకర్, రజనీకాంత్ కాంబినేషన్‌లో వస్తున్న 2.0 టీజర్ డేట్‌ను ప్రకటించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 13న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. రోబో చిత్రానికి ఈ సినిమా సీక్వెల్ అనే విషయం తెలిసిందే.

    తమిళంతోపాటు పలు భాషల్లో రూపొందుతున్న రోబో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ చిత్రంలో రిచర్డ్ అనే సైంటిస్ట్ పాత్రలో అక్షయ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో కాకి మాదిరిగా ఉండే గెటప్‌తో అక్షయ్ నటించాడు.

    Rajinikanths 2.0 teaser will be out September 13

    సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. అమెరికాలో ప్రముఖ కంపెనీ చేస్తున్న వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తి కాకపోవడమే ప్రధాన కారణం. ఈ సినిమా గ్రాఫిక్ పనులు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని నవంబర్ 29న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించింది.

    రోబో 2.0 చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. అత్యంత సాంకేతిక విలువలతో ఈ చిత్రం 3డీ ఫార్మాట్‌లో రూపొందింది. క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడేది లేదు అని రెహ్మన్ స్పష్టం చేవారు. గ్రాఫిక్ ఎఫెక్ట్స్ లేకుండానే ఓ పాట చూశాను. చిత్రీకరణ మైండ్ బ్లోయింగ్ ఉంది అని రెహ్మాన్ వెల్లడించడం గమనార్హం.

    English summary
    Fans of Thalaiva Rajinikanth and Akshay Kumar who had been waiting for the teaser of 2.0 since months finally have some great news. It seems the teaser will release on the auspicious occasion of Ganesh Chaturthi that falls on September 13.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X