Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రజనీ ఫ్యాన్స్‌కు శుభవార్త.. సెప్టెంబర్ 13న రోబో 2.0..
ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు శుభవార్త. సంచలన దర్శకుడు శంకర్, రజనీకాంత్ కాంబినేషన్లో వస్తున్న 2.0 టీజర్ డేట్‌ను ప్రకటించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 13న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. రోబో చిత్రానికి ఈ సినిమా సీక్వెల్ అనే విషయం తెలిసిందే.
తమిళంతోపాటు పలు భాషల్లో రూపొందుతున్న రోబో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ చిత్రంలో రిచర్డ్ అనే సైంటిస్ట్ పాత్రలో అక్షయ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో కాకి మాదిరిగా ఉండే గెటప్‌తో అక్షయ్ నటించాడు.
సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. అమెరికాలో ప్రముఖ కంపెనీ చేస్తున్న వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడమే ప్రధాన కారణం. ఈ సినిమా గ్రాఫిక్ పనులు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని నవంబర్ 29న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్గా నటించింది.
రోబో 2.0 చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. అత్యంత సాంకేతిక విలువలతో ఈ చిత్రం 3డీ ఫార్మాట్లో రూపొందింది. క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడేది లేదు అని రెహ్మన్ స్పష్టం చేవారు. గ్రాఫిక్ ఎఫెక్ట్స్ లేకుండానే ఓ పాట చూశాను. చిత్రీకరణ మైండ్ బ్లోయింగ్ ఉంది అని రెహ్మాన్ వెల్లడించడం గమనార్హం.