2.0: రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన అక్షయ్ కుమార్
రజనీకాంత్ అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూసే. శంకర్ దర్శకత్వంలో రజనీ, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న '2.0' చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది. నవంబర్ 3న రిలీజ్ చేయబోతున్నారు.
ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించబోతున్న అక్షయ్ కుమార్ '2.0' ట్రైలర్ విడుదల తేదీని ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. 'ఫిప్త్ ఫోర్స్ ఈజ్ కమింగ్. నవంబర్ 3న 2.0 ట్రైలర్ విడుదల కాబోతోంది. సిద్ధంగా ఉండండి' అని తెలిపారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సైతం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

గతంలో వచ్చిన 'రోబో' చిత్రానికి సీక్వెల్‌గా '2.0' సినిమా ఉండబోతోంది. ఇందులో రజనీకాంత్ రోబో చిట్టిగా కనిపించబోతున్నారు. ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధికంగా దాదాపు రూ. 543 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు. హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ సినిమా ఉండబోతోంది.
ఈ భారీ మూవీలో అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో సరికొత్త అవతారంలో కనిపించబోతుండటంతో బాలీవుడ్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అమీ జాక్సన్ ఫిమేల్ లీడ్. ఆమె కూడా రోబో పాత్రలో కనిపించబోతున్నారు.
నవంబర్ 29న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ రిలీజ్ అవ్వనంత భారీ సంఖ్యలో స్క్రీన్లలో ఇది విడుదల కాబోతోంది. కలెక్షన్ల పరంగా అన్ని రికార్డులను ఈ చిత్రం బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











