twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్బార్ ప్రీ రిలీజ్ రివ్యూ: రజనీ మార్కు మ్యాజిక్.. బ్లాక్‌బస్టర్ ఖాయమేనా?

    |

    సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు ఏఆర్ మురగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న దర్బార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్లు, టీజర్ల రిలీజ్ తర్వాత సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ముంబై బ్యాక్‌డ్రాప్‌గా రూపొందిన ఈ సినిమాలో భారీ స్థాయిలో తారాగాణం ఉండటంతో సినిమా మరింత క్రేజ్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేకతలు మీకోసం..

    7 వేలకుపైగా థియేటర్లలో

    7 వేలకుపైగా థియేటర్లలో

    దర్బార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజవుతున్నది. రజనీకాంత్ కెరీర్‌లో చెప్పుకోదగినట్టుగా 7 వేలకుపైగా థియేటర్లో ఈ చిత్రం రిలీజ్ కానున్నది. ఈ చిత్రం భారత్‌లోనే 4 వేల స్క్రీన్లలో రిలీజ్ అవుతున్నది. కేవలం ఆసియాలోనే కాకుండా దాదాపు యూరప్, ఆస్ట్రేలియా ఉత్తర అమెరికాతోపాటు పలు దీవుల్లో కూడా దర్బార్ రిలీజ్ కావడం గమనార్హం.

    చాలా ఏళ్ల తర్వాత పోలీస్ ఆఫీసర్‌గా

    చాలా ఏళ్ల తర్వాత పోలీస్ ఆఫీసర్‌గా

    దర్బార్ చిత్రంలో రజనీకాంత్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో రజనీ మేనరిజం కూడా ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. దీంతో రజనీ నటించిన దర్బార్ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఉత్సాహం ప్రేక్షకుల్లో కలిగింది.

    చంద్రముఖి తర్వాత నయనతారతో

    చంద్రముఖి తర్వాత నయనతారతో

    2005లో వచ్చిన చంద్రముఖి తర్వాత రజనీకాంత్, నయనతార జంటగా నటించారు. ఇటీవల రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కంటే ఇప్పుడే నయనతార చాలా అందంగా కనిపిస్తున్నారు అని అన్నారు. ఈ చిత్రంలో రజనీ, నయనతార మధ్య కెమిస్ట్రీ పీక్స్‌లో ఉందనే మాట బలంగా వినిపిస్తున్నది. అందుకు సాక్ష్యంగా ట్రైలర్లు, టీజర్లు చెప్పకనే చెప్పాయి.

    సవాల్‌గా తీసుకొని దర్బార్

    సవాల్‌గా తీసుకొని దర్బార్

    దర్బార్ చిత్రాన్ని సవాల్‌గా తీసుకొని దర్శకుడు మురగదాస్ రూపొందించారనే విషయం తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గతంలో సర్కార్ చిత్రానికి మురగదాస్ రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం ప్రేక్షకుల అంచనాలు చేరుకోకపోవడంతో దర్బార్ చిత్రాన్ని కసితో రూపొందించారనే ప్రచారం సినీ వర్గాల్లో జరిగింది.

    మ్యూజిక్, సినిమాటోగ్రఫి

    మ్యూజిక్, సినిమాటోగ్రఫి

    దర్బార్ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహించారు. అనిరుధ్ అందించిన పాటలు మాస్, క్లాస్ ఆడియెన్స్‌ను అలరించాయి. ఇటీవల కాలంలో రజనీ చిత్రాల్లో వచ్చిన ఈ ఆడియో కంటే దర్బార్ మ్యూజిక్ విలక్షణంగా ఉందనే మాటను సంగీత ప్రియుల నుంచి వచ్చింది.

    ఇంటెన్సివ్ స్టోరీతో

    ఇంటెన్సివ్ స్టోరీతో

    ముంబై బ్యాక్ డ్రాప్‌గా దర్బార్ చిత్రం కథ ఇంటెన్సివ్, మిస్టరీ కథతో రూపొందించింది. ఈ చిత్రంలో రజనీ మార్క్ యాక్షన్, సెంటిమెంట్ కీలకమని చిత్ర యూనిట్ చెప్పింది. రజనీ మార్క్ డైలాగ్స్, మేనరిజం, ఇతర అంశాలు ప్రేక్షకులను థియేటర్‌కు పరుగులు పెట్టించడం ఖాయం అనే మాట వినిపిస్తున్నది.

    English summary
    Rajinikanth's Darbar set to release for Sankranti festival. In wake of 9 Janauary release created huge expectations.This movie is releasing 7000 screens worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X