రజనీకాంత్ ధీటుగా యువ విలన్.. దర్బార్‌లో ప్రముఖ నటి కుమారుడు

సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార నటిస్తున్న తాజా చిత్రం దర్బార్. ఇటీవల రిలీజైన ఫస్ట్‌లుక్ సెన్సేషనల్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రజనీకాంత్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో విలన్ పాత్ర ఎవరనే విషయాన్ని గుట్టుగా ఉంచారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ విలన్‌గా నటిస్తున్నట్టు తాజా సమాచారం. తాను దర్బార్ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నట్టు ముంబై పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తాజా ఇంటర్వ్యూలో ప్రతీక్ బబ్బర్ మాట్లాడుతూ.. రజనీకాంత్ సార్‌తో నటించడం నాకు గొప్ప కలలాంటింది. ఆ సెట్లోకి ఎప్పుడెప్పుడు వెళ్దామా అనే ఆసక్తి నెలకొన్నది. నెగిటివ్ ఛాయలు ఉన్న క్యారెక్టర్‌ నాకు బాగా నచ్చింది. ఈ పాత్ర కోసం 200 శాతం కష్టపడుతాను. ఇది నాకు జీవితకాలంలో లభించే అవకాశంగా భావిస్తున్నాను అని అన్నారు.

భాగీ2 చిత్రంలో ప్రతీక్ నటన చూసి మురుగదాస్ ఆకర్షితులయ్యారు. దాంతో అతడిని తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. రజనీ ధీటుగా విలన్ పాత్రలో కనిపిస్తాడు. ముంబైలో జరిగే షెడ్యూల్‌లో దర్బార్ టీమ్‌తో భాగమవుతాడు అని చిత్ర యూనిట్ తెలిపింది.

Rajinikanths Darbar to have Prateik Babbar as villain

కాంగ్రెస్ నేత, ప్రముఖ నటుడు రాజ్ బబ్బర్, ప్రముఖ నటి, దివంగత స్మితా పాటిల్ కుమారుడే ప్రతీక్ బబ్బర్. ప్రస్తుతం బాలీవుడ్‌లో చిత్‌చోర్, పవర్, అభి తో పార్టీ షూరూ హోయీ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు.

దర్భార్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ నిర్మిసున్నది. సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్‌కు సిద్దమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X