దర్బార్ ట్రైలర్: పోలీస్ అంటే ఉద్యోగం కాదు.. కేక పుట్టించిన రజినీకాంత్

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా సినిమా 'దర్బార్'. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీకాంత్ జోడీగా నయనతార నటిస్తోంది. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఔట్ అండ్ ఔట్ మాస్ సన్నివేశాలు, రజినీకాంత్ స్టైల్

ఔట్ అండ్ ఔట్ మాస్ సన్నివేశాలు, రజినీకాంత్ స్టైల్

ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, సాంగ్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో అదే జోష్‌లో దర్బార్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఒక నిమిషం 45 సెకనుల నిడివితో కూడిన ఈ ట్రైలర్‌లో ఔట్ అండ్ ఔట్ మాస్ సన్నివేశాలు, రజినీకాంత్ స్టైల్ ఆయన అభిమానులను కనువిందు చేశాయి.

రజినీ మేనరిజం.. అదరగొట్టే డైలాగ్స్

రజినీ మేనరిజం.. అదరగొట్టే డైలాగ్స్

ఇక ఈ ట్రైలర్‌ చూస్తుంటే.. దర్బార్ సినిమాలో రజినీకాంత్ మేనరిజానికి కొత్త హంగులు జోడించి తెరకెక్కించారని స్పష్టమవుతోంది. రజినీకాంత్ అభిమానులను దృప్టిలో పెట్టుకుని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ‘దర్బార్' మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది. ఇక రజినీ డైలాగ్స్ అయితే అబ్బో! భలే అదరగొట్టేస్తున్నాయి.

ముంబై పోలీస్ కమీషనర్.. వాడు పోలీస్ ఆఫీసరా?

ముంబై పోలీస్ కమీషనర్.. వాడు పోలీస్ ఆఫీసరా?

చిత్రంలో ముంబై పోలీస్ కమీషనర్ ఆదిత్య అరుణాచలం అనే పాత్రలో రజినీకాంత్ నటించాడు. ట్రైలర్‌లో ముందుగా వాడు పోలీస్ ఆఫీసరా సర్ ? హంతకుడు.. అంటూ రజినీకాంత్ మేనరిజాన్ని పరిచయం చేసి, ఆ తర్వాత రజినీ డైలాగ్స్ చూపించారు. ఇందులో ''పోలీస్ అంటే ఉద్యోగం కాదు.. రక్షణ కల్పించడం'' అనే డైలాగ్, ''ఆ చూపేంటి.. ఒరిజినల్‌గా విలనమ్మా అ.. ఐయామ్ ఏ బ్యాడ్ కాప్'' అని రజినీకాంత్ చెప్పిన డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి.

తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దర్బార్

దాదాపు 28 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రజినీకాంత్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. టీజర్, ట్రైలర్‌లో సహజశైలితో ఆయన కేక పుట్టించాడు.
దీంతో అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. 2020 జనవరి 9 వ తేదీన తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దర్బార్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించనుందో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X