Darbar ప్రపంచవ్యాప్తంగా డిమాండ్.. ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు చూస్తే..
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రాబోతున్న తాజా సినిమా 'దర్బార్'. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజినీకాంత్ జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
జనవరి 9వ తేదీన 'దర్బార్' విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు దర్బార్ నుంచి ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయడంతో డిమాండ్ పెరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 'దర్బార్' ప్రీ రిలీజ్ బిజినెస్ నెంబర్స్ చెప్పుకోదగినవిగా నమోదయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 15 కోట్ల మేర నమోదు కాగా ప్రపంచవ్యాప్తంగా 141.7 కోట్ల బిజినెస్ జరిగింది.

ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. తమిళనాడు 65 కోట్లు, తెలుగు రాష్ట్రాలు 15 కోట్లు, కర్ణాటక 9 కోట్లు, కేరళ 5.7 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 12 కోట్లు, ఓవర్సిస్ 35 కోట్లు.. మొత్తంగా వరల్డ్ వైడ్ 141.7 కోట్ల బిజినెస్ చేసింది దర్బార్.
చిత్రంలో ముంబై పోలీస్ కమీషనర్ ఆదిత్య అరుణాచలం అనే పాత్రలో రజినీకాంత్ నటించాడు. టీజర్, ట్రైలర్‌లో సహజశైలితో ఆయన కేక పుట్టించాడు.
దీంతో అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. 2020 జనవరి 9వ తేదీన తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దర్బార్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











