Coolie: అలాంటి వాళ్లను నమ్మొద్దు.. సత్యరాజ్‌తో విభేదాలపై రజనీకాంత్ కామెంట్స్
Photo Courtesy: x.com/sunpictures
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కూలీ. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ దాదాపు రూ.370 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్‌లు కీలకపాత్ర పోషిస్తుండగా.. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ దర్శకత్వం వహిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 14న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూలీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
వరుస విజయాలతో దూకుడు మీదున్న లోకేష్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తుండటంతో ఈ సినిమాపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఆగస్ట్ 2వ తేదీ చెన్నైలో కూలీ ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

Photo Courtesy: x.com/sunpictures
కూలీకి లోకేష్ కనగరాజే హీరో, అనిరుధ్ భారతీయ సినీ పరిశ్రమలో ఏకైక రాక్‌స్టార్ అని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. సత్యరాజ్‌కు నాకు భావజాలం విషయంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ఆయన తన మనసుకి వచ్చే ప్రతిదాని గురించి బహిరంగంగా మాట్లాడగల వ్యక్తి అని రజనీ ప్రశంసించారు. అలాంటి వారిని నమ్మొచ్చని.. కానీ ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకునే వారిని నమ్మకూడదన్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా లోకేష్ కనకరాజ్ 2 గంటల పాటు ఇంటర్వ్యూ ఇచ్చారని.. దానిని కూర్చొని, పడుకుని ఏ రకంగానూ చూడలేకపోయానని రజనీ నవ్వులు పూయించారు. లోకేష్ తొలుత నాకు కథ చెప్పినప్పుడు.. అందులో నేను విలన్‌ని సీక్రెట్ బయటపెట్టారు.
ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. భారీ స్టార్ క్యాస్టింగ్‌తో ఓ కమర్షియల్ డైరెక్టర్‌గా కూలీని లోకేష్ తెరకెక్కించారు. ఈ కాంబో ఖచ్చితంగా తుఫాన్ సృష్టిస్తుందని రజనీకాంత్ ఆకాంక్షించారు. నాగార్జున ఈ వయసులోనూ చాలా అందంగా కనిపిస్తున్నారని.. నా జుట్టు అంతా ఊడిపోయింది, మీ ఫిట్‌నెస్ రహస్యం ఏమిటీ అని నేను ఆయనను కనుక్కున్నానని రజనీ తెలిపారు. వ్యాయామం వల్లే ఇది సాధ్యమని నాగ్ చెప్పారని.. ఆయన ఇందులో నెగిటివ్ రోల్‌లో అద్భుతంగా నటించారని తలైవా ప్రశంసించారు. చిన్నతనంలో నా మిత్రుడు తన గోల్డ్ చైన్ ఇచ్చి.. నువ్వు సినిమాల్లో నటిస్తున్నావని చెప్పాడని అందుకే నేను ఇక్కడ ఉన్నానని రజనీ తన మిత్రుడు రాజ్ బహదూర్ గురించి ప్రస్తావించారు. మీకు ఎంత డబ్బు, కీర్తి వచ్చినా.. ఇంట్లో మన:శాంతి, బయట రెస్పెక్ట్ లేకపోతే ఏది విలువైనది కాదని రజనీ అన్నారు.


Click it and Unblock the Notifications











