twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేంద్ర ప్రభుత్వ ప్రకటన.. సూపర్ స్టార్‌కు అరుదైన గౌరవం

    |

    ఇండియన్ హీరో సూపర్ స్టార్ రజినీ కాంత్‌ను కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవంతో సత్కరించనుంది. ఆసియాలోనే ఎంతో ఘనంగా నిర్వహించే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI-2019) ఈవెంట్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను ఈ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు ఐకాన్‌గా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది.

    గత కొన్ని దశాబ్దాలుగా భారత సినీ పరిశ్రమకు రజనీకాంత్ చేసిన సేవలకు గానూ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు ఐకాన్‌గా ప్రకటించడం నాకెంతో సంతోషంగా ఉంది అంటూ కేంద్ర సమచార మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశాడు. దీంతో దేశవ్యాప్తంగా సూపర్‌స్టార్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

    Rajinikanth To Be Conferred ICON OF Golden Jubilee For IFFI 2019

    ఈ వేడుకలో యాభై మంది మహిళా దర్శకులు తీసిన చిత్రాలను ప్రదర్శించినట్లు.. అంతేగాక ఓ ఫ్రెంచ్ నటి ఇసాబెల్లి హుపర్ట్‌కు లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డును ప్రకటించినున్నట్లు తెలిపారు. నవంబర్ 20 నుంచి నవంబర్ 28 వరకు గోవాలో ఈ వేడుకలు అట్టహాసంగా జరుగనున్నట్లు తెలిపారు. ఈ వేడుకులకు అన్ని ఇండస్ట్రీల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.

    English summary
    Rajinikanth To Be Conferred ICON OF Golden Jubilee For IFFI 2019. In recognition of his outstanding contribution to Indian cinema, during the past several decades, I am happy to announce that the award for the ICON OF GOLDEN JUBILEE OF #IFFI2019 is being conferred on cine star Shri S Rajnikant.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X