twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కదిలిన కోలీవుడ్.. పెద్దమనసు చాటుకున్న స్టార్ హీరోలు.. సినీ కార్మికులకు భారీ విరాళం!

    |

    ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు సాధారణ జనం అల్లలాడుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు మూత పడ్డాయి. మార్చి 31 వరకు లాక్ డౌన్‌ను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దినసరి కూలీలు పడే అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అయితే సినీ కార్మికులను ఆదుకునేందుకు స్టార్ హీరోలంతా ముందడుగు వేశారు.

    మూతపడిని సినీ పరిశ్రమ..

    మూతపడిని సినీ పరిశ్రమ..

    కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు సినీ పరిశ్రమ స్వచ్చందంగా ముందుకు వచ్చింది. మార్చి 31 వరకు సినిమా షూటింగ్స్, అన్ని కార్యక్రమాలను రద్దు చేశారు. ఆ కారణంగా సినీ పరిశ్రమలో దినసరి కూలీలకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. వీరిని ఆదుకునేందుకు కోలీవుడ్ ముందడుగు వేసింది.

     దక్షిణ భారత సంఘం..

    దక్షిణ భారత సంఘం..

    దక్షిణ భారత సినీ కార్మిక సంఘం అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి ఇచ్చిన పిలుపు మేరకు స్టార్ హీరోలంతా కదిలి వచ్చారు. సినీ శ్రామికులను ఆదుకోవాలని, అందరూ తమకు తోచిన సాయాన్ని చేయాలని ఆర్కే పిలుపునిచ్చాడు. ఆయన ఇచ్చిన పిలుపుకు సూపర్ స్టార్ కదలగా.. మిగతా హీరోలంతా కదిలి వచ్చారు.

    యాభై లక్షలు ప్రకటించిన రజినీ..

    యాభై లక్షలు ప్రకటించిన రజినీ..

    దాదాపు 25 వేల మంది సభ్యత్వం ఉన్న ఆ సంస్థకు సూపర్ స్టార్ రజినీకాంత్ 50లక్షల విరాళాన్ని ప్రకటించి పెద్ద మనసును చాటుకున్నాడు. ఇదే వరుసలో యంగ్ హీరోలు సైతం నడుస్తున్నారు. తమకు చేతనైన సాయాన్ని ప్రకటించి రియల్ హీరోస్ అనిపించుకున్నారు.

    Recommended Video

    Director Shankar Responds On Indian 2 Crane Mishap
     పది లక్షల చొప్పున..

    పది లక్షల చొప్పున..

    మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, యంగ్ హీరో కార్తికేయన్.. పది లక్షల విరాళాన్ని ప్రకటించారు. మన టాలీవుడ్ హీరోలు కూడా సినీ కార్మికులను ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రాజశేఖర్, నితిన్ వంటి వారు నెటిజన్ల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.

    English summary
    Rajinikanth Vijay Sethupathi And Sivakarthikeyan Donations To FEFSI. In The Lock Down Situation Film Empolyees Are Facing Problem. in This regard Rajinikanth Donated 50lakhs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X