దర్భార్ హవా : రజినీ కోసం పూజలు.. థియేటర్లలో ఫ్యాన్స్ హంగామా
రజినీకాంత్ సినిమా అంటే ఏ రేంజ్‌లో హంగామా ఉంటుందో ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. తమిళ నాట అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాత్రి నుంచి థియేటర్ల వర్ద పడిగాపులు కాస్తూ ఉంటారు అభిమానులు. తమిళ దైవంగా భావించే తలైవా సినిమా అంటే అక్కడి ప్రేక్షకుల్లో వచ్చే కిక్కే వేరు. కేవలం తమిళ నాటే అలాంటి ఫీవర్ ఉంటుందా? అని అనుకుంటే పొరపాటే. దేశవిదేశాల్లో రజినీకి ఉండే అభిమాన గణం ఏపాటిదో అందరికీ తెలిసిందే. జపాన్, మలేసియా, థాయ్‌లాండ్, అరబ్ దేశాలు ఇలా రజినీ మ్యానియా ఖండాంతరాలు దాటిపోయింది.

దర్బార్‌పై భారీ అంచనాలు..
ఏ ఆర్ మురుగదాస్ వంటి విలక్షణ దర్శకుడు రజినీతో సినిమా ప్రకటించగానే తలైవా ఫ్యాన్స్‌లో సంబరాలు మొదలయ్యాయి. కెరీర్‌లో ఫస్ట్ వీరిద్దరు కలిసి పని చేస్తుండటంతో సగటు సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మొదలైంది. వీరి కాంబినేషన్‌లో సినిమా అంటే ఎలా ఉండబోతోందా? అని టీజర్, ట్రైలర్‌తోనే ఓ హింట్ ఇచ్చేశారు.

వైరల్‌గా మారిన ట్రైలర్..
రజినీ మ్యానరిజం, స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన స్టైల్‌కు పెట్టింది పేరు. అదే ఈ సినిమాలోనూ ప్రతిబింబించినట్టు తెలుస్తోంది. ఏఆర్ మురుగదాస్ టేకింగ్, అనిరుద్ సంగీతం ఈ సినిమాను అద్భుతంగా మలిచినట్టు తెలుస్తోంది. దర్బార్ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ ఓ రేంజ్‌లో వైరల్ కాగా.. నేడు తలైవా ఫ్యాన్స్ ఉత్కంఠకు తెరపడింది. భారీ ఎత్తున దర్బార్ థియేటర్లలోకి వచ్చేసింది.

ఫ్యాన్స్ హంగామా..
ఈ చిత్రం కోసం థియేటర్ల వద్ద అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. థియేటర్ల వద్ద డప్పులు వాయిస్తూ డ్యాన్సులు చేస్తూ హంగామా చేస్తున్నారు. సంక్రాంతి ముగ్గులు వేస్తూ రజినీ చిత్ర పటాన్ని గీయడం, పూజలు చేస్తూ అభిమానిని చాటుచుకున్నారు. దర్బార్ స్టైల్‌లో గెటప్‌లు వేసుకుని థియేటర్ వద్ద హంగామా చేస్తున్నారు.

ఇప్పటికే టాక్..
ట్విట్టర్‌లో దర్బార్ గురించి హోరెత్తిస్తున్నారు ఫ్యాన్స్. ఇది పూర్తిగా రజినీ సినిమా అని, మ్యానరిజం, స్టైల్ కేక అంటూ కామెంట్లు పెడుతున్నారు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని, ఏఆర్ మురుగదాస్ మరో లెవెల్‌లో చూపించాడని కామెంట్లు చేస్తున్నారు. రజినీ ఫ్యాన్స్‌కు ట్రీట్‌లా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











