Annaatthe: రజినీకాంత్ మూవీ తెలుగు నిర్మాతల సొంతం.. ఆ రాష్ట్రంలో ఒకరు.. ఇక్కడ మరొకరు

దాదాపు నాలుగు దశాబ్దాలుగా దక్షిణాదిలోని అన్ని భాషల్లో హవాను చూపిస్తూ దేశమే గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఏజ్ బార్ అవుతోన్నా.. కుర్రాళ్లతో పోటీగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌తో కనిపిస్తుంటారు. ఆరు పదుల వయసులోనూ ఎంతో వేగంగా మూవీలను చేస్తోన్న ఆయన.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక, ఈ మధ్య కాలంలో రజినీకాంత్ సరైన హిట్ కోసం వేచి చూస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. అవన్నీ ఫ్యాన్స్‌ను కూడా అలరించలేకపోయాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ను అందుకోవాలని పట్టుదలతో ఉన్నారాయన.

ఊరమాస్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సిరిత్తి శివ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం 'అన్నత్తే'. పూర్తి స్థాయి కుటుంబ కథతో రూపొందిన ఈ మూవీ షూటింగ్ చాలా ఏళ్ల క్రితమే ప్రారంభం అయింది. ఆరంభంలో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగినా.. ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా దానికి ఆటంకం వచ్చింది. అనంతరం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోన్న సమయంలో రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత సెకెండ్ వేవ్ వచ్చింది. ఇలా ఈ చిత్రానికి వరుస ఆటకంకాలు ఎదురవుతూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే దీన్ని పూర్తి చేసేశారు.

Rajinikanths Annaatthe Telugu Rights Sold Out

సుదీర్ఘ విరామం తర్వార సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న కుటుంబ కథా చిత్రం కావడంతో 'అన్నత్తే'పై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కించారు. ఇక, ఇటీవలే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఇందులో భాగంగానే వదిలిన పోస్టర్, పాటలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. అదే సమయంలో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా 'అన్నత్తే' మూవీ తెలుగు రాష్ట్రాల డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ క్రేజ్ ఉంది. దీంతో ఆయన నటించిన ప్రతి సినిమానూ ఇక్కడ కూడా విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'అన్నత్తే' మూవీని సైతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు హక్కులను ఏషియన్ సినిమాస్ సంస్థ రూ. 12 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నైజాంలో ఆ సంస్థ స్వయంగా దీన్ని విడుదల చేస్తుండగా.. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని పంపిణీ చేయబోతున్నారని తెలిసింది. బడా నిర్మాతలు కావడంతో 'అన్నత్తే' మూవీ ఏ రేంజ్‌లో విడుదల అవుతుందో అర్థం చేసుకోవచ్చు.

'అన్నత్తే' మూవీలో రజినీకాంత్ పవర్‌ఫుల్ రోల్‌ను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు అన్నయ్య అనే టైటిల్ పెడుతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. సిస్టర్ సెంటిమెంట్‌తో వస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, రజినీకాంత్‌కు సోదరిగా నటిస్తుందట. ఇక, ఈ మూవీ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X