‘రామారావు’ కోసం ఇద్దరు అమ్మాయిలు: అధికారికంగా ప్రకటించిన యూనిట్

ఈ ఏడాది ఆరంభంలో 'క్రాక్' వంటి భారీ హిట్‌ను అందుకుని మాస్ మహారాజా రవితేజ ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే 'ఖిలాడీ' అనే సినిమా పట్టాల పైకి ఎక్కించేశాడు. ఇది షూటింగ్ పూర్తి కాకముందే శరత్ మందవ అనే దర్శకుడితో 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. అంతేకాదు, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను కూడా పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్‌డేట్‌ను ఇచ్చింది.

సందేశాత్మకమైన కథతో రూపొందుతోన్న 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీలో మాస్ మహారాజా రవితేజ సరసన దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య ఓ ఫొటో కూడా వైరల్ అయింది. కానీ, అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే, తాజాగా ఈ సినిమాలో ఏకంగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అందులో ఒకరు దివ్యాన్షా కౌశిక్ కాగా, మరొకరు రజిషా విజయన్. వీళ్లిద్దరికీ స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు చిత్ర నిర్మాతలు. ఇక, ఇందులో ఈ ఇద్దరు బ్యూటీలకూ సమానమైన ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు.

Rajisha Vijayan and Divyansha Kaushik on board for Ravi Tejas Ramarao On Duty

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఇటీవల వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అవన్నీ చూపించారు. ప్రజా సమస్యల కోసం ఉద్యోగాన్ని వదిలేసి పోరాటం చేసిన వ్యక్తి కథతో ఇది తెరకెక్కుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే సంవత్సరం ప్రారంభంలో కానీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X