బాలీవుడ్ యువ హీరో ఇంట్లో విషాదం
బాలీవుడ్ యువ హీరో, విలక్షణ నటుడు రాజ్‌కుమార్ రావు ఇంట్లో విషాదం నెలకొన్నది. ఆయన తండ్రి సత్యపాల్ యాదవ్ ఆకస్మిక మరణం చెందడంతో పుట్టెడు దు:ఖంలో మునిగిపోయాడు. సత్యపాల్ యాదవ్ వయసు 60 ఏళ్లు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని మేదంతా హాస్పిటల్‌లో 17 రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన గురుగావ్‌లోని మరణించారు. పితృవియోగంతో బాధపడుతున్న రాజ్‌కుమార్‌కు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
రాజ్‌కుమార్ రావు తండ్రి సత్యపాల్ యాదవ్ అంత్యక్రియలు శుక్రవారం ఉదయం గుర్గావ్‌లోని మదన్‌పూరి శ్మశాన వాటికలో ముగిసాయి. అంత్యక్రియలకు స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చారు. పుట్టెడు దు:ఖంలో మునిగిన రాజ్‌కుమార్‌ను ఓదార్చారు.

2017లో న్యూటన్ సినిమా షూటింగ్‌లో ఉండగా రాజ్‌కుమార్ తల్లి మరణించారు. అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే షూటింగ్‌కు హాజరుకావడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. నన్ను సినిమాల్లో నటుడిగా చూడాలని నా తల్లి కోరిక. అందుకే నా కోరికను గౌరవించేందుకే తాను షూటింగ్‌కు హాజరయ్యాను అని రాజ్‌కుమార్ తెలిపారు.


Click it and Unblock the Notifications











