twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నరాలు బిగబట్టి చూడాల్సిందే... ‘రాజుగారి గది 3’ ట్రైలర్

    |

    రాజుగారిగ‌ది, రాజుగారిగ‌ది 2 చిత్రాల త‌ర్వాత ఈ సీరిస్‌లో వస్తున్న మరో చిత్రం రాజుగారి గది 3. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రంలో అశ్విన్‌బాబు, అవికాగోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా 'రాజుగారి గది 3' ట్రైలర్ విడుదలైంది. యక్షిణి అనే దెయ్యం చుట్టూ కథ తిరుగుతుందని తెలస్తోంది. సినిమాలో హారర్ ఏ స్థాయిలో ఉంటుందో ట్రైలర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రేక్షకులు నరాలు బిగబట్టి చూసేలా థ్రిల్లింగ్ సీన్లు ఈ చిత్రంలో ఉన్నట్లు ట్రైలర్లో స్పష్టమవుతోంది. ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేనర్లో ఓంకార్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఇటీవల ఓ కార్యక్రమంలో ఈ సినిమా గురించి ఓంకార్ మాట్లాడుతూ... రాజుగారిగ‌ది,రాజుగారిగది 2చిత్రాల కంటే ఈ సినిమా క‌చ్చితంగా పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. ఈ సినిమాకు ఛోటాగారు, గౌతంరాజుగారు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ష‌బీర్ స‌హా ఇత‌ర టెక్నీషియ‌న్స్ అలాగే అశ్విన్‌, అవికా, అలీగారు, బ్ర‌హ్మాజీగారు, ఊర్వ‌శిగారు ఇలా అంద‌రూ వారి సొంత సినిమాగా భావించి చేయ‌డం వ‌ల్ల సినిమా చాలా బాగా వ‌చ్చింది అన్నారు.

    Raju Gari Gadhi 3 Official Trailer released

    ఈ చిత్రంలో అవికాగోర్‌, అశ్విన్ బాబు, అలీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌భాస్ శ్రీను, హ‌రితేజ‌, అజ‌య్ ఘోష్‌, ఊర్వ‌శి త‌దిత‌రులు నటిస్తున్నారు. ద‌ర్శ‌క‌త్వం: ఓంకార్‌, బ్యాన‌ర్‌: ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: క‌ల్యాణి చ‌క్ర‌వ‌ర్తి, సినిమాటోగ్ర‌ఫీ: ఛోటా కె.నాయుడు, ఎడిట‌ర్‌: గౌతంరాజు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సాహి సురేశ్‌, డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా, పాటలు: శ్రీమ‌ణి, ఆడియోగ్ర‌ఫీ: రాధాకృష్ణ‌, స్టంట్స్‌: వెంక‌ట్‌.

    English summary
    Raju Gari Gadhi 3 Official Trailer released. The movie starring Ashwin Babu, Avika Gor, Ali, Brahmaji, Urvashi, Ajay Ghosh, Prabhas Sreenu, Hariteja, Dhanraj.. directed, Produced by Ohmkar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X