డెలివరీ బాయ్‌పై టాలీవుడ్ హీరో దాడి.. ముఖంపై ఉమ్మేసి దారుణంగా..
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు యువ హీరోలు అనవసర వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నా యువ హీరో అఖిల్ రాజ్ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
అఖిల్ రాజ్ ఇంటికి డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన ఫుడ్ డెలివరీ బాయ్ తనను కొడుతున్నాడంటూ వీడియో తీశాడు. రాంగ్ డెలివరీ ఇచ్చినందుకు నన్ను అమ్మనా బూతులు మాట్లాడి.. థూ అని ముఖం మీద ఉమ్మేసి నా మీద చేయి చేసుకున్నాడు. ఈ ఆంటీ కూడా నా ముఖం మీద ఉసిందని చెబుతుండగా అఖిల్ వచ్చి.. ఎక్కువ వాగుతున్నావంటూ అతని ముఖంపై పిడిగుద్ధులు కురిపించాడు. రాంగ్ ఆర్డర్ ఇచ్చినందుకు నేను సారీ చెప్పాను.. అయినా నువ్వు కొట్టడానికి వస్తున్నావా అని డెలివరీ బాయ్ ఆవేదన వ్యక్తం చేశాడు

ఈ మాటలతో అఖిల్ రాజ్ బాగా కొప్పడుతూ వీరంగం వేశాడు. అతని తల్లిదండ్రులు వద్దని వారిస్తున్నప్పటికీ వినకుండా రెచ్చిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు హీరోపై ట్రోలింగ్‌కు దిగారు. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. రాజు వెడ్స్ రాంబాయి విజయంతో హీరోగా నిలదొక్కుకునేందుకు అఖిల్ రాజ్ శ్రమిస్తున్నాడు. కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నప్పటికీ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇలాంటి పరిస్ధితుల్లో ఈ గొడవ జరగడం కలకలం రేపుతోంది.
ఒక్కొక్క అడుగు వేస్తూ జీవితంలో ఇక్కడి వరకు వచ్చానని అఖిల్ రాజ్ పలుమార్లు అన్నారు. ఆడిషన్స్‌లో పాల్గొంటూ, అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నా.. నా జీవితాన్ని రాజు వెడ్స్ రాంబాయి మూవీ సమూలంగా మార్చేసింది. ఈ మూవీ నాకు ఫేస్‌ని ఇచ్చింది, నేను ఏ స్థాయికి చేరుకున్నా రాజు వెడ్స్ రాంబాయి మాత్రం కెరీర్‌లోనే ప్రత్యేకం. ఈ సినిమాకు ముందు ఒప్పుకున్న పలు కథల్లో నటిస్తున్నాను అని అఖిల్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రాజు వెండ్స్ రాంబాయి తర్వాత హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈషాలో అఖిల్ నటించారు.
కాగా.. సాయిలు కంపటి దర్శకత్వంలో వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో అఖిల్ రాజ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది నవంబర్ 21న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. డోలాముఖి సుబాల్టెర్న్ ఫిల్మ్స్, మాన్‌సూన్ టేల్స్ బ్యానర్‌పై దర్శకుడు వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవిలు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో అఖిల్ రాజ్ సరసన తేజస్వి రావు హీరోయిన్‌గా నటించారు. చైతు జొన్నలగడ్డ, అనితా చౌదరి, కవితా శ్రీరంగం తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాజు వెడ్స్ రాంబాయి మూవీ తొలివారం 7.15 కోట్ల రూపాయలు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ తర్వాత తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌లో 2025 డిసెంబర్ 18 నుంచి అందుబాటులోకి వస్తోంది.


Click it and Unblock the Notifications


