‘దమ్ముంటే నా సినిమాని టచ్ చేయండి... అమీర్‌పేట సెంటర్‌లో కట్ డ్రయిర్‌తో ఉరుకుతా’
ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సినిమా తీసే దర్శక నిర్మాతలకు ఇటీవలి కాలంలో నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ ట్రోలింగ్ తీవ్ర ఇబ్బందిగా మారింది. స్టార్ హీరోల నుంచి చిన్న చితకా హీరోల వరకు ఈ నెగిటివ్ ట్రోలింగ్ వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా దీనిపై ఘాటుగా స్పందించారు కూడా. సినిమా రిలీజ్ కావడానికి ముందే ఇందులోని కథ, కథనం, క్యారెక్టర్‌లపై పుకార్లు వ్యాపింపజేస్తూ.. దర్శక నిర్మాతలు, నటీనటుల్ని అసభ్యంగా దూషించడం వంటి ఘటనలపై చిత్ర పరిశ్రమ కూడా తీవ్రంగా పరిగణిస్తోంది. తాజాగా తన సినిమాపై నెగిటివ్ ట్రోలింగ్ జరిగితే ఊరుకునేది లేదని ఓ చిన్న దర్శకుడు సవాల్ విసిరారు. ఈ వివరాల్లోకి వెళితే..
నవంబర్ 21న రాజు వెడ్స్ రాంబాయి
అఖిల్ రాజ్ - తేజస్విని జంటగా సాయిలు కంపటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్స్‌లో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవిలు ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 21న రాజు వెడ్స్ రాంబాయి సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటిలు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో రాజు వెడ్స్ రాంబాయి చిత్ర యూనిట్ గత కొద్దిరోజులుగా ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. తాజాగా నవంబర్ 20వ తేదీన హైదరాబాద్‌లో రాజు వెడ్స్ రాంబాయి మాస్ బరాత్ పేరిట ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో కిరణ్ అబ్బవరం చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్‌పై దర్శకుడు సాయిలు కంపాటి హాట్ కామెంట్స్ చేశారు.

తెలుగులో ఆయనే ఏఆర్ రెహమాన్
తమిళనాడుకు ఒక రెహమాన్ ఉన్నాడు.. తెలుగుకి సురేష్ బొబ్బిలి రెహమాన్. మంచి మెలోడీస్, ఆర్ఆర్.. ఇప్పటికీ గుర్తుంది ఇక్కడే ఆఫీసులో ఉన్నప్పుడు విరాట పర్వం ట్రైలర్ బీజీఎం విని నేను ఎన్నోసార్లు ఏడ్చా. అందులో నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుచేసుకున్నా.. ఒక మనిషికి తన బీజీఎం ద్వారా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుచేయగల సత్తా ఈ మనిషికి ఉంది. ఆర్ఆర్‌లో నువ్వు తోపు.. నీ టైం స్టార్ట్ అయ్యింది, కొడితే కుంభస్థలం అంతే.. నెలకొకటి కొట్టుకో. ఇక్కడంతా పెద్ద పద్దోళ్లు ఉన్నారు.. వాళ్లందరికీ థ్యాంక్స్. నా టెక్నీషియన్స్‌కి థ్యాంక్స్. అందరూ నాకు హెల్ప్ చేశారు.. మిగతా వాళ్లంతా నాకు చాలా హెల్ప్ చేశారు అని సాయిలు తెలిపారు.
నా హీరో హెలికాఫ్టర్‌లోంచి దిగడు
నేను ఇవాళ కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నా.. ఈ సినిమాను తక్కువ చేసినవాళ్లకి ఒకటే చెబుతా. నేను ఊరోడిని, ఊరు కథలే రాస్తా. ఎందుకంటే నేను చూసిన ఊరు, నేను చూసిన మట్టి మనుషులు, పోలాల్లో నాట్లువేసే మనుషులు, నాగళి పట్టుకుని నడిచే మనుషులు.. అమాయకత్వంతో ఉండే ఆటో డ్రైవర్లు, అమ్మాయిలు. వాళ్ల మధ్య పుట్టే ప్రేమ.. నాకు ఇవే తెలుసు. నేను హెలికాఫ్టర్‌లో నుంచి వచ్చే హీరోని, మెట్రో ట్రైన్‌లో దిగొచ్చే హీరోనో రాయలేను.. ఎందుకంటే నా ఒరిజినాలిటీ అది కాదు, నేను అదే రాస్తా, ఇదే తీస్తా, నాకు ఇవే వచ్చు. ఓ కొత్త కథను చెప్పడానికి వచ్చా.. ఇదేందో విలేజ్, మట్టి గోడలు.. నాది చిన్న బతుకు, ఊరిలో నుంచి వచ్చి ఓ కథ రాసుకున్నా. మిమ్మల్ని హర్ట్ చేస్తే క్షమించండన్నా... కానీ దయచేసి నెగిటివ్ ప్రచారం చేయొద్దన్నా అని సాయిలు విజ్ఞప్తి చేశారు.
కట్ డ్రయిర్‌తో పరిగెడతా
ఒక పదిహేనేళ్లు నరకం చూపించిన ఒక కథని, ఆ మనుషుల్ని బయటకు తీసుకొచ్చి కథ చెబుదామనుకుంటే.. మీకు నచ్చలేదు చలో లైట్ తీసుకో. కానీ ప్రచారం చేయకండి అన్నా.. చిన్న సినిమా. కానీ నేను పెద్ద ఎమోషన్ గురించి చెబుదామనుకున్నా. మిమ్మల్ని హర్ట్ చేస్తే క్షమించండి, దయచేసి నెగిటివ్ టాక్ తీసుకురావొద్దు. సినిమాకు 21వ తారీఖున నెగిటివ్ టాక్ వస్తే అమీర్‌పేట సెంటర్‌లో కట్ డ్రయిర్‌తో ఉరుకుతా. ఇంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నానంటే దయచేసి అర్ధం చేసుకోండి. నా లెక్కనే మట్టి వాసన తెలిసిన మంచి మనిషి.. సినిమా అన్నింటిని ఇస్తుంది, ఏం కావాలో అందరినీ తీసుకొస్తుంది. కిరణ్ అన్నా.. థ్యాంక్స్.. మొన్న బండ్ల గణేష్ అన్న చెప్పింది నిజం. ఆ మనిషి డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ మనిషి తీరు కానీ లవ్ యూ అని సాయిలు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











