Rakesh Master: నేను చనిపోతే శేఖర్, జానీ చేసేది ఇదే.. రాకేష్ మాస్టర్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ (55) హఠాత్తుగా కన్నుమూశారు. గత కొంతకాలంగా డయాబెటిక్, బీపీ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం సాయంత్రం చికిత్స పొందుతూ మరణించారు. దీంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక స్టార్ కొరియోగ్రాఫర్స్ అయిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఇద్దరు రాకేష్ మాస్టర్ శిష్యులు అని తెలిసిందే. అయితే తాను చనిపోయినప్పుడు శేఖర్, జానీ, సత్య మాస్టర్స్ ఏం చేస్తారనేది ముందే చెప్పారు రాకేష్ మాస్టర్. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్టార్ కిడ్స్ కు డ్యాన్స్:కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న రాకేష్ మాస్టర్ తిరుపతిలో జన్మించారు. ఆయన చిన్నతనం మొత్తం కూడా అక్కడే గడిపారు. యంగ్ ఏజ్ కు రాకముందే డాన్స్ మాస్టర్ గా గుర్తింపును అందుకోవాలని ఎంతో హార్డ్ వర్క్ చేశారు. చెన్నైలో ఒక డాన్సర్ గా కొనసాగిన రాకేష్ మాస్టర్ ప్రయాణం హైదరాబాద్ కు వచ్చి ఒక డాన్స్ స్కూల్ ని ప్రారంభించేలా చేసింది. అందులో ప్రముఖుల పిల్లలకు డ్యాన్స్ నేర్పించారు.

Rakesh Master About Sekhar Johnny Satya Masters Reactions In His Funerals

చిరునవ్వుతో గుర్తింపు:ఓవైపు పిల్లలకు డ్యాన్స్ నేర్పుతూనే మరోవైపు సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసి ఆకట్టుకున్నారు రాకేష్ మాస్టర్. అయితే రాకేష్ మాస్టర్ కు మొదటి అవకాశాన్ని హీరో వేణు తొట్టెంపూడి ఇచ్చారు. వేణు హీరోగా మొదట్లో చేసిన అన్ని సినిమాలకు దాదాపుగా రాకేష్ మాస్టరే నృత్యం అందించారు. అందులో చిరునవ్వు సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది.

ఆ దర్శకుడితో:రాకేష్ మాస్టర్ ఎక్కువగా డైరెక్టర్ వైవీఎస్ చౌదరి సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ ఉండేవారు. దేవదాసు, లాహిరి లాహిరిలో, సీతయ్య వంటి సినిమాలకు కూడా పని చేసిన రాకేష్ మాస్టర్ మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అంతేకాకుండా ప్రభాస్, రామ్ పోతినేని వంటి హీరోలకు సైతం ఆయన డ్యాన్స్ నేర్పించారు.

Rakesh Master About Sekhar Johnny Satya Masters Reactions In His Funerals

శేఖర్ మాస్టర్ తో విభేదాలు:తెలుగు చిత్ర పరిశ్రమలో 1200కుపైగా సినిమాలకు పని చేసిన రాకేష్ మాస్టర్ 1500 పాటలకు కొరియోగ్రఫీ అందించారు. ఆయన వద్ద ప్రముఖ కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, జానీ, సత్య మాస్టర్ శిష్యరికం చేసిన విషయం తెలిసిందే. అయితే శేఖర్ మాస్టర్ కు, రాకేష్ మాస్టర్ కు కొన్ని విభేదాలు ఉన్నట్లు అప్పట్లో వార్తలు తెగ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. తాను ఒకవేళ మరణిస్తే శేఖర్, జానీ ఎలా స్పందిస్తారో ఓ ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ తెలిపారు.

Rakesh Master About Sekhar Johnny Satya Masters Reactions In His Funerals

అలా మ్యానేజ్ చేస్తారు:"నా మరణం తర్వాత శేఖర్, సత్య మాస్టర్లు పూల మాలలతో వస్తారు. కానీ వారిలో బాధ కంటే సంతోషమే ఎక్కువ ఉంటుంది. అప్పుడు వారికి ఏడుపు రాకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటిస్తారు. గతంలో నేను వారి కోసం చేసిన రెండు మంచి మాటలు చెబుతూనే ఎప్పుడెప్పుడూ డెడ్ బాడీనీ తీసేస్తారా.. అక్కడి నుంచి వెళ్లిపోదామా అని చూస్తారు. జానీ మాస్టర్ కు మాత్రం ఏడుద్దామని అనుకున్నా కన్నీళ్లు రావు. దీంతో జెండూ బామ్ పూసుకోని మ్యానేజ్ చేస్తాడు. అంత్యక్రియల తర్వాత వాళ్లంతా రిలాక్స్ అవుతారు" అని రాకేష్ మాస్టర్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X