రాఖీ సావంత్ ఇంట్లో దూరిన గుర్తు తెలియని వ్యక్తి.. ఫ్యాన్ ని అంటూ బలవంతంగా అలా?

బాలీవుడ్ డ్రామా క్వీన్ రాఖీ సావంత్ తరచూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తుంటారు. రాఖీ అభిమానులు ఆమెను ఎంతగానో ప్రేమిస్తారు. రాఖీ సావంత్ వీడియోలు సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే వైరల్ కావడం గురించి కూడా అందరికీ తెలుసు. అయితే రాఖీ గురించి ఒక సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి రాఖీ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఏకంగా దాని కోసం తలుపులు కూడా బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. రాఖీ పోలీస్ స్టేషన్‌లో ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేసిందని అంటున్నారు. తాజాగా బాలీవుడ్ ఫోటో గ్రాఫర్ వైరల్ భయానీ రాఖీ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడని రాఖీ చెబుతోంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఆ సమయంలో ఇంట్లో ఒక అమ్మాయి ఉందని పేర్కొన్నారు.

నేను ఇంట్లో లేను, ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, ఆమె చాలా భయపడిందన్న రాఖీ సావంత్ ఓషివారా పోలీస్ స్టేషన్‌లో వ్యక్తిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాఖీ సదరు వ్యక్తి గురించి మాట్లాడుతూ, అతను పదేపదే తన అభిమాని అని చెబుతున్నాడని, అతను నిజంగా అభిమాని అయితే, ఒక వ్యక్తి ప్రేమించే వాడు అయితే తలుపు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించడని అన్నారు. ఇక రాఖీ సావంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకుని జైలులో పెట్టారు. నిజానికి రాఖీ సావంత్ 'బిగ్ బాస్ 14' లో పాల్గొన్నప్పటి నుంచి బాగా ఫేమస్ అయ్యారు. రాఖీ తన కొత్త ప్రాజెక్ట్‌లలో చాలా బిజీగా ఉంది. ఆమె చేసిన ఒక స్పెషల్ సాంగ్ 'లాక్‌డౌన్' ఇటీవల విడుదలైంది.

Rakhi Sawant Fan Broke Her Gate She Filed complaint

ఇంతకు ముందు 'డ్రీమ్ మే ఎంట్రీ' అనే పాట విడుదలైంది, ఇది అభిమానులకు బాగా నచ్చింది. ఇక రాఖీ సావంత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఈ నటి తన జీవితాన్ని ఎల్లప్పుడూ బహిరంగంగా ఉంచుతుంది. ఇక రాఖీ సావంత్ 'మైన్ హూన్ నా' మరియు 'దిల్ బోలే హడిప్ప', 'జోరు కా గులాం', 'ఏక్ కహానీ జూలీ కి' మరియు 'బుద్ధ మార్ జయేగా' వంటి అనేక బాలీవుడ్ చిత్రాలలో కూడా కీలక పాత్రలు పోషించారు. ఆ మధ్య ఆమె డ్రగ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 'రాఖీ జీ బాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ ఎందుకు తీసుకుంటారు?'అని అడిగితే దానికి డ్రామా క్వీన్, కొద్దిసేపు మౌనంగా ఉండి, తనని ఆ ప్రశ్న అడిగిన వారి వంక చూస్తూ 'బాలీవుడ్ ప్రముఖులు ఎవరూ డ్రగ్స్ తీసుకోరని, అవన్నీ పవిత్రమైనవని పేర్కొన్నారు. ఈ పరిశ్రమలో ఉన్న మీరందరూ దాన్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? మీరు మంత్రుల కుమారులను ఎందుకు పట్టుకోలేదు? అని ప్రశ్నించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X