‘రాక్షసుడు’గా రాబోతున్న బెల్లకొండ శ్రీనివాస్
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రైడ్, వీర చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో రెండు నెలల క్రితం కొత్త చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎ హవీష్ లక్ష్మణ్ కొనేరు ప్రొడక్షన్ బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి 'రాక్షసుడు' అనే టైటిల్ ఫైనలైజ్ చేశారు. షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయిందని, ఉగాది సందర్భంగా అపీషియల్ టైటిల్ పోస్టర్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. జూన్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా 'రాక్షసుడు' మూవీ తెరకెక్కిస్తున్న రమేష్‌వర్మ.. ఫిబ్రవరి 20న షూటింగ్ మొదలు పెట్టి శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
బెల్లకొండ శ్రీనివాస్ మరో వైపు తేజ దర్శకత్వంలో నటించిన 'సీత' త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఏప్రిల్ 25న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 'కవచం' తర్వాత మరోసారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ కలసి నటిస్తున్న చిత్రమిది.


Click it and Unblock the Notifications











