‘రాక్షసుడు’ చిత్రానికి భలే బిజినెస్ జరిగిందే...
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న చిత్రం రాక్షసుడు. ఏ స్టూడియోస్ బ్యానర్‌పై హవీశ్ ప్రొడక్షన్‌లో రమేశ్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది.
పలు సార్లు వాయిదాపడిన ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ రిలీజైన తర్వాత మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 14 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రానికి ఇది భారీ మొత్తమే అని చెప్పొచ్చు.

ఏరియా వారిగా బిజినెస్ వివరాలు పరిశీలిస్తే నైజాం రూ. 4.50 కోట్లు(అడ్వాన్స్ బేసిస్), సీడెడ్ రూ. 1.80 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 1.50 కోట్లు, ఈస్ట్ రూ. 96 లక్షలు, కృష్ణ రూ. 1 కోటి, గుంటూరు రూ. 1.20 కోట్లు, వెస్ట్ రూ. 84 లక్షలు, నెల్లూరు రూ. 50 లక్షలు, రెస్టాఫ్ ఇండియా రూ. 90 లక్షలు, ఓవర్సీస్ రూ. 80 లక్షలకు రైట్స్ అమ్ముడైనట్లు సమాచారం.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి రచన: సాగర్, ఆర్ట్: గాంధీ నడికొడికర్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: జిబ్రాన్, నిర్మాత: సత్యనారాయణ కొనేరు, దర్శకత్వం: రమేష్ వర్మ పెన్మత్స.


Click it and Unblock the Notifications











